Begin typing your search above and press return to search.

2024కి స్వాగతం పలికిన న‌యా ప్రేమ జంట‌

ఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండే ప్రేమాయ‌ణం గురించి చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:04 AM GMT
2024కి స్వాగతం పలికిన న‌యా ప్రేమ జంట‌
X

ఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండే ప్రేమాయ‌ణం గురించి చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. చాలా సంద‌ర్భాల్లో జంట‌గా షికార్ చేస్తూ ఆ ఇద్ద‌రూ కెమెరా కంటికి చిక్కారు. ఇప్పుడు అంద‌మైన జంట కొత్త ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. 'ఆషికీ 2' సహనటుడు షాద్ రాంధవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త సంవత్సర వేడుకల నుండి ఒక ఫోటోను షేర్ చేసారు. ఇందులో అనన్య - ఆదిత్య షాద్ జంట అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. గ్రూప్ లో ఇతర స్నేహితులతో కలిసి వారు పోజులిచ్చారు. '2024కి స్వాగతం' అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు. అనన్య నలుపు - గోధుమ రంగు బాడీకాన్ దుస్తులను ధ‌రించింది. థై స్లిట్ ఎలివేష‌న్ దుస్తులు ఆక‌ర్షించాయి. ఆదిత్య నలుపు స్వెటర్ - కోటులో అందంగా కనిపించాడు.


ఈ ఫోటోను షేర్ చేసిన వెంటనే, పలువురు రెడ్డిటర్స్ ఫోటోపై కామెంట్ చేశారు. ఒక నెటిజన్ ఇలా రాశాడు. అన‌న్య‌ నిజంగా చాలా అందంగా ఉంది!అని రాయ‌గా, మరో నెటిజన్ ''ఆమె అమ్మానాన్నలు ఆంటీలతో పోజులిచ్చిన చిన్నపిల్లలా కనిపిస్తోంది'' అని రాశాడు. నెటిజన్లలో ఒకరు ''వారు ఒకేలా కనిపిస్తారు'' అని రాశారు. వారు మంచి జంట అని పొగిడేశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆదిత్య త‌దుప‌రి అనురాగ్ బసు 'మెట్రో ఇన్ డినో'లో కనిపించనున్నాడు. సారా అలీ ఖాన్ ఇందులో క‌థానాయిక‌. అనన్య చివరిగా 'ఖో గయే హమ్ కహాన్‌'లో కనిపించింది. త‌దుప‌రి కరణ్ జోహార్ ధర్మాటిక్ సిరీస్ 'కాల్ మీ బే'లో కనిపించనుంది. ఆదిత్య‌, అన‌న్య ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ. మ‌రో వైపు రొమాంటిక్ ల‌వ్ లైఫ్ తో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు.