అనన్య పాండే.. ఇది నెవ్వర్ బిఫోర్ ఏమో!
అయితే మూవీలో అక్షయ్ కుమార్ తో పాటు ఆర్. మాధవన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటించారు.
By: Tupaki Desk | 19 April 2025 11:30 PMబాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి అందరికీ తెలిసిందే. బీ టౌన్ యాక్టర్ చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. జీరో సైజ్ బ్యూటీ అనే ట్యాగ్ ను సంపాదించుకుంది అనన్య పాండే.
అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది బ్యూటీ. ఆ తర్వాత వరుస అవకాశాలు.. క్రేజీ ఛాన్సులు ఆమె సొంతం. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించినా.. సక్సెస్ అందుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించి ఆ మూవీ డిజాస్టర్ అయింది.
ఇప్పుడు రీసెంట్ గా కేసరి ఛాప్టర్- 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య పాండే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. నిన్నటి నుంచి థియేటర్ల సందడి చేస్తోంది. కరణ్ త్యాగి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జలియాన్ వాలా బాగ్ మారణహోమం ఆధారంగా తెరకెక్కిన పూర్తిస్థాయి మూవీగా నిలిచింది.
అయితే మూవీలో అక్షయ్ కుమార్ తో పాటు ఆర్. మాధవన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటించారు. మంచి కోర్టు డ్రామాగా అలరించిన ఆ మూవీలోని క్యాస్టింగ్ అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ వేరే లెవెల్ ప్రశంసలు సొంతం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ రోల్స్ లో జీవించేశారని కొనియాడుతున్నారు.
ఇక సినిమాలో అనన్య పాండే యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా నటించిందని అంతా చెబుతున్నారు. ముఖ్యంగా కరణ్ త్యాగి.. డెబ్యూ సినిమా ఇదే.. కానీ ఆయన తన టాలెంట్ తో మెప్పించారు. ఇప్పుడు అనన్య నటనా నైపుణ్యాలను వెలికితీసేందుకు నెటిజన్లు కరణ్ సింగ్ త్యాగిని నెట్టింట ప్రశంసిస్తున్నారు.
అదే సమయంలో ఇప్పుడు సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రీ బుకింగ్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మే 1వ తేదీ వరకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో కేసరి చాప్టర్ 2 మంచి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సినిమా ఎంత రాబడుతుందో వేచి చూడాలి.