సవాల్ విసిరే పాత్రలకే సై!
మొత్తానికి అనన్యలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో ఎంతో దూకుడుగా వ్యవరించిన అమ్మడు ఇప్పుడా దూకుడు కూడా తగ్గించింది.
By: Tupaki Desk | 10 May 2025 7:30 AMబాలీవుడ్ లో అనన్యా పాండే కెరీర్ మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగిపోతుంది. జయాపజయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. టాలీవుడ్ లో కలిసి రాలేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం మంచి కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది. ఇటీవలే 'కేసరి చాప్టర్ 2'తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇందులో అమ్మడి పాత్రకు మంచి పేరొచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న రోల్ కావడంతోనే ఇది సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా అనన్యా పాండేలో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు ఆమె మాటల్లో కనిపిస్తుంది. కథల విషయంలో ఎలా వ్యవహరించాలి? అన్నది ఈ సినిమా ఓ అవగాహన ఇచ్చిందని తెలిపింది. 'బ్యాడ్ న్యూ'జ్, 'కాల్ మీ బె' లాంటి చిత్రాల్లో ఇప్పటి వరకూ తాను చేసినవి కేవలం కామెడీ పాత్రలని... గ్లామరస్ పాత్రల్లో నటిస్తే కేవలం అనుభూతి మాత్రమే వస్తుందంది. కానీ 'కేసరి' లాంటి సినిమాలో సవాల్ విసిరే పాత్ర చేస్తే అసలైన నటి బయటకు వచ్చిందని అభిప్రాయపడింది.
ఇక పై ఎలాంటి పాత్ర తీసుకున్నా? అది సవాల్ గా ఉండాలి తప్ప సునాయాసంగా ఉండకూడదంది. శక్తి వంతమైన పాత్రలు పోషించినప్పుడే ఏ నటిలోనైనా అసలైన నటి బయటకు వస్తుందని తెలిసింది. కెరీర్ కొత్తలో ఇలాంటివి తెలియక తప్పులు జరగడం సహజమైనా? ఇప్పుడున్న పోటీలో అలాంటి తప్పులు ఆరం భంలో కూడా చేయకూడదని అభిప్రాయపడింది. అలా చేస్తే అవకాశాలు రావడం కష్టమంది.
మొత్తానికి అనన్యలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో ఎంతో దూకుడుగా వ్యవరించిన అమ్మడు ఇప్పుడా దూకుడు కూడా తగ్గించింది. ప్రోఫెషనల్ కెరీర్ లోనే కాదు...పర్సనల్ కెరీర్ లోనే అనన్య లో చాలా మార్పులొచ్చాయని ఆమె ని దగ్గర నుంచి చూసే స్నేహితులు అభిప్రాయపడుతున్నారు. మార్పు మంచిదే కదా. 'లైగర్' సినిమాతో అనన్యా పాండే టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.