సెట్లో అనన్యను ఝడిపించిన నెమలి
ప్రస్తుతం రాజస్తాన్‌లో షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లో ఉన్నప్పుడు అనన్య ఊహించని ఒక భయానక క్షణాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది.
By: Tupaki Desk | 28 July 2025 9:53 AM ISTకొన్నిసార్లు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి ఊహించనివి.. ఆకస్మికంగా ఎదురయ్యేవి. అలాంటి ఒక సన్నివేశాన్ని ఎదుర్కొంది 'లైగర్' బ్యూటీ అనన్యా పాండే. ఈ భామ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. 'తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ' అనేది టైటిల్. ప్రేమికులరోజు కానుకగా ఈ చిత్రం 13 ఫిబ్రవరి 2026న విడుదల కానుంది.
ప్రస్తుతం రాజస్తాన్‌లో షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లో ఉన్నప్పుడు అనన్య ఊహించని ఒక భయానక క్షణాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది. తన ఇన్ స్టాలో ఓ రెండు ఫోటోలను అనన్య షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో అనన్యకు చాలా దగ్గరగా వచ్చిన ఓ నెమలి (మయూరం) తనను భయపెడుతూ కనిపించింది. అసలు మానవమాత్రులను చూసినా భయం అన్నదే లేకుండా ఆ నెమలి ఎటాక్ స్టార్ట్ చేసిందట. అందుకే అనన్య భయపడ్డానని చెబుతోంది. అయితే చివరికి నెమలితో అనన్య శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ''అది శాంతించింది.. చివరికి స్నేహం చేసింది'' అని తెలిపింది అనన్య. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
అనన్య జైపూర్‌లోని ప్రసిద్ధ కాలే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శించింది. స్పాట్ నుంచి ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. 'కృతజ్ఞతతో ఉండటానికి చాలా ఉంది' అనే శీర్షికను కూడా జోడించింది. రొమాంటిక్ కామెడీ చిత్రం `తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ` తెర వెనుక ఫోటోలను అనన్య నిరంతరం షేర్ చేస్తోంది. సమీర్ విద్వాన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 చిత్రం 'పతి పత్ని ఔర్ వో' తర్వాత ఇది కార్తీక్- అనన్య జంటకు రెండో సినిమా.
నిజానికి 'కర్మ' సిద్ధాంతంలో ఏవైనా పక్షులు, జంతువులు లేదా మూగజీవాలు మనుషులకు చేరువగా వచ్చాయి అంటే అది కచ్ఛితంగా పూర్వజన్మ బంధానికి సంబంధించిన మ్యాటర్. పోయిన జన్మలో అనన్యకు ఆ నెమలి గొప్ప స్నేహితురాలు అయ్యి ఉండొచ్చు. ఏడు జన్మల్లో ఈ జన్మ మానవ అవతారం. వచ్చే జన్మలో అనన్య నెమలి అయి పుడుతుందేమో!!!
