పిట్ట గోడ ఎక్కిన మస్త్ మస్త్ జవానీ
మరోవైపు అనన్యకు యూత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా పాపులర్ బ్రాండ్స్ తన వెంట క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్స్ కి అనన్య ప్రచారం చేస్తోంది.
By: Tupaki Desk | 28 April 2025 8:45 AM ISTఅందానికి అందం ప్రతిభతో యువతరం హృదయాలను గెలుచుకున్న బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్ లో నటవారసురాలిగా ఆరంగేట్రం చేసినా ఒక్కో సినిమాతో నటిగా పరిణతి చెందుతూ ఇప్పుడు సౌత్ లోను ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. దేవరకొండ సరసన పాన్ ఇండియన్ మూవీ `లైగర్` ఫ్లాపైనా కానీ, అనన్యకు క్రేజ్ తగ్గలేదు. సౌత్ నుంచి ఈ బ్యూటీని మరిన్ని ఆఫర్లు వరించనున్నాయి.. కానీ దానికి కొంత సమయం పట్టొచ్చు.
మరోవైపు అనన్యకు యూత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా పాపులర్ బ్రాండ్స్ తన వెంట క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్స్ కి అనన్య ప్రచారం చేస్తోంది. ఏడాది ప్రచారానికి కోటి పైగా అందుకుంటోందని సమాచారం. ఇప్పుడు అలాంటి ఒక బ్రాండ్ ప్రచారంలో భాగంగా పిట్టగోడ ఎక్కి ఫోజులిచ్చింది. టైట్ ట్రాక్ ధరించి పిట్టగోడపై ఈ సన్నజాజి ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. అనన్య ఫ్యాన్స్ ఈ ఫోటోగ్రాఫ్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు.
బ్రింజాల్ ట్రాక్ లో అనన్య ఒంపు సొంపులు ఒక రేంజులో ఎలివేట్ అయ్యాయంటే బోయ్స్ కితాబిచ్చేస్తున్నారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవలే విడుదలైన కేసరి చాప్టర్ 2లో అనన్య పాండే నటనకు మంచి పేరొచ్చింది. బ్రిటీషర్ల పాలనలో జలియన్ వాలాబాగ్ దురంతం అనంతరం జరిగిన కోర్ట్ రూమ్ సన్నివేశాల్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని ప్రశంసలు కురుస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఈ సినిమాని వీక్షించి ఇప్పుడు రివ్యూ ఇవ్వడం ఆసక్తి ని కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు.
