Begin typing your search above and press return to search.

బికినీలో రెచ్చగొడుతున్న అనన్య.. కుర్రాళ్లు జర భద్రం!

సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో బికినీ అందాలతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   14 Sept 2025 1:11 AM IST
బికినీలో రెచ్చగొడుతున్న అనన్య.. కుర్రాళ్లు జర భద్రం!
X

సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో బికినీ అందాలతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెకేషన్స్ కి వెళ్తే చాలు అక్కడ బికినీలు ధరించి, ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. సాధారణంగా గ్లామర్ వలకబోస్తేనే తట్టుకోలేని యువత.. ఇలా ఒక్కసారిగా తమ అభిమాన హీరోయిన్స్ బికినీలు వేస్తే తట్టుకుంటారా? ఆ గ్లామర్ కి కుర్రకారు హీటెక్కిపోరు.. అయినా సరే తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పైగా బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా కొంతమంది హీరోయిన్స్ ఇలా బికినీలలో దర్శనం ఇచ్చి అలరిస్తున్న విషయం తెలిసిందే.


అలా బికినీలతో రెచ్చగొడుతున్న హీరోయిన్లలో అనన్య పాండే కూడా ఒకరు. ఎప్పటికప్పుడు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఈమధ్య ఎక్కువగా బికినీలు వేసి మరీ చెమటలు పట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్స్ కి వెళ్ళిన అనన్య పాండే.. అక్కడ వైట్ కలర్ బికినీ వేసి తన అందాలతో రెచ్చగొట్టింది.. ఇది చూసిన ఫాలోవర్స్ అబ్బాయిలూ జరభద్రం.. అనన్య గ్లామర్ కి హీటెక్కిపోతారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అమ్మడు చాలా హాట్ గురూ అంటూ ఎవరికి వారు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


అనన్య పాండే విషయానికి వస్తే.. ప్రముఖ హిందీ నటుడు శరత్ పాండే కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తొలిసారి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా అడుగు పెట్టింది. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ ఓ' అనే సినిమాతో హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకుంది అనన్య. 1998 అక్టోబర్ 30న ముంబైలో జన్మించిన ఈమె ఒకవైపు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది.


అనన్య పాండే హిందీలోనే కాదు తెలుగులో కూడా సినిమా చేసింది. అలా ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ చేసిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య.. భారీ ప్రమోషన్స్ మధ్య విడుదల అయింది కానీ4డిజాస్టర్ గా నిలిచింది. ఇలా తెలుగులో ఇచ్చిన మొదటి సినిమాలోనే డిజాస్టర్ ని చవి చూడడంతో అమ్మడికి తెలుగు ఇండస్ట్రీ కలిసి రాలేదు అనే వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. అలా కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్తూ ఇలా అభిమానులను కూడా అలరిస్తోంది.