లిప్ ఫిల్లర్స్ వేసాక దిశా పటానీలా మారింది
ఇవన్నీ చూసాక.. అనన్య లిప్ ఫిల్ చేసిందా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే దిశా పటానీలా కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 13 Jun 2025 10:36 PM ISTఏమాత్రం అవకాశం దొరికినా నటీమణులను ఆటపట్టించేందుకు నెటినులు (యూత్) వెనకాడరు. ఇప్పుడు అనన్య వంతు. ఈ అమ్మడు ఊహించని కారణాలతో నెటిజనులకు చిక్కింది. నిజానికి చాలా మంది కథానాయికలు తమ అందం పెంచుకునేందుకు రకరకాల శస్త్ర చికిత్సలు చేయింకున్నారని ఇదివరకూ కథనాలొచ్చాయి. శ్రీదేవి నుంచి జాన్వీ వరకూ.. నాలుగు తరాల స్టార్లను ఉదాహరణగా చూపించారు. ఇప్పుడు అనన్య పాండే కూడా అదే బాపతు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.
అనన్య తన పెదవులకు ఫిల్లర్స్ వేయించుకుందని, ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ భామ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో కలిసి తన తదుపరి చిత్రం 'తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ' షూటింగ్ లో ఉంది. ఈ చిత్ర బృందం మొత్తం క్రొయేషియా తీరప్రాంతాల్లో ఉంది. స్పాట్ నుంచి అనన్య కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుస ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి వెంటనే అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఇవన్నీ చూసాక.. అనన్య లిప్ ఫిల్ చేసిందా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే దిశా పటానీలా కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. అనన్య టాన్డ్ లుక్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఫిల్లర్స్??? బొటాక్స్??? వైయ్య్ వంటి పదజాలంతో కొందరు తీవ్రంగానే కామెంట్లు చేసారు. క్రొయేషియాలో తన రొమాంటిక్ కామెడీ మూవీ 'తూ మేరీ......' షూటింగ్ టైమ్ గురించి అనన్య వివరాల్ని షేర్ చేసింది. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - నమ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ నుండి ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కరణ్ జోహార్ ఇన్‌స్టాలో అధికారిక కాస్టింగ్ ప్రకటనను తొలగించారు. వాలెంటైన్స్ డే కానుకగా 13 ఫిబ్రవరి 2026న థియేటర్లలోకి వస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
ఈ జంట మొదట 2019 చిత్రం 'పతి పత్ని ఔర్ వో'లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో డేటింగ్ గురించి కూడా గుసగుసలు వినిపించాయి. ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల సమయంలో వారి స్నేహం స్పష్టంగా కనిపించింది. దీనితో అభిమానులు, మీడియా ఆఫ్ స్క్రీన్ ప్రేమాయణం గురించి చాలా ఊహాగానాలు సాగించారు. కానీ ఆ తర్వాత కెరీర్ కోసం దారులు వేరయ్యాయి. అటుపై అనన్య యువహీరో ఆదిత్యా రాయ్ కపూర్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
