Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో మూవీలో 'లైగర్‌' ఐటెం..!

అఖిల్ చివరగా 'ఏజెంట్‌' సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   1 Jun 2025 8:35 AM
అక్కినేని హీరో మూవీలో లైగర్‌ ఐటెం..!
X

అఖిల్ చివరగా 'ఏజెంట్‌' సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఏజెంట్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో అఖిల్‌ తదుపరి సినిమా విషయంలో చాలా టైమ్ తీసుకున్నాడు. అక్కినేని ఫ్యాన్స్‌ అఖిల్ సినిమాల విషయంలో నిరుత్సాహంగా ఉన్నారు. కెరీర్‌ ఆరంభం నుంచి అఖిల్‌ ప్రతి సినిమాకు కష్టపడుతున్నాడు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. అందుకే అఖిల్‌ ఈసారి కాస్త ఎక్కువ సమ యం తీసుకుని, మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్‌ ప్రస్తుతం 'లెనిన్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నారు. సినిమాను నవంబర్‌ 14న విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన లెనిన్‌ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. అఖిల్‌ లుక్‌తో పాటు, శ్రీలీల లుక్‌, ఇతర బ్యాక్‌డ్రాప్‌ అన్ని కలిపి లెనిన్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. సినిమాకు హైప్‌ పెంచే విధంగా, సినిమాను మరింత మందికి చేరువ అయ్యే విధంగా చేసేందుకు గాను మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ఐటెం సాంగ్‌ను ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మను ఈ సినిమా కోసం రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అఖిల్‌ అక్కినేనితో 'లెనిన్‌' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు కొన్ని రోజుల క్రితం అనన్య పాండేనే ఈ సినిమా కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్‌ సినిమాలో అనన్య పాండే ఐటెం సాంగ్‌ను చేసేందుకు గాను ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. లైగర్‌ సినిమా తర్వాత టాలీవుడ్‌లో అనన్య కనిపించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. లైగర్‌ సినిమాలో ఇష్టం లేకుండా నటించాను అంటూ చెప్పిన అనన్య పాండే లెనిన్ సినిమాలో ఐటెం సాంగ్‌కి మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యంను కలిగించే విషయం.

లెనిన్‌ సినిమా కోసం అఖిల్‌ అక్కినేని చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. పుష్ప తర్వాత లెనిన్ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబోతున్నారు. అఖిల్‌ లుక్‌కి పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కింది. ఇక అఖిల్‌కి జోడీగా శ్రీలీల నటించడం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ మొత్తం చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరి అందరి అంచనాలను లెనిన్ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి. అఖిల్‌ పెళ్లి తర్వాత లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మొదటి సారి రాబోతున్నాడు. కనుక ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చూడాలి.