Begin typing your search above and press return to search.

మీకు t**లు లేవు .. మీకు a** లేదు...నా ఒంపుల‌పై ఘోర‌మైన కామెంట్లు చేసారు!

`స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అన‌న్య పాండే. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ ఈ నేపో కిడ్ ని తెర‌కు ప‌రిచ‌యం చేసారు

By:  Tupaki Desk   |   18 May 2025 1:45 PM IST
మీకు t**లు లేవు .. మీకు a** లేదు...నా ఒంపుల‌పై ఘోర‌మైన కామెంట్లు చేసారు!
X

`స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అన‌న్య పాండే. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ ఈ నేపో కిడ్ ని తెర‌కు ప‌రిచ‌యం చేసారు. ప్ర‌స్తుతం అన‌న్య బాలీవుడ్ లోని మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోయిన్ల‌లో ఒక‌రు. యువ‌న‌టుడు ఆదిత్య రాయ్ క‌పూర్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అన‌న్య ప్ర‌స్తుతం అతడి నుంచి బ్రేక‌ప్ అయి ఒంట‌రిగా ఉంది.

ఈ స‌మ‌యంలో ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో అన‌న్య త‌న కెరీర్ తొలినాళ్లలో బాడీ షేమింగ్ గురించి గుర్తు చేసుకుంది. అప్ప‌ట్లో తాను స‌న్న‌గా ఉండేదానిని అని దాంతో చాలా బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నాన‌ని అన‌న్య అన్న‌రు. త‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఒంపుసొంపులు లేవ‌ని ప‌లువురు కామెంట్ చేసార‌ని చెప్పింది. ఈ రూపంతో నువ్వు ఎప్ప‌టికీ నెగ్గ‌లేవని నిరాశ‌ప‌రిచారు. 18-19 ఉంటుంది నా వ‌య‌సు.

నిజంగా సన్నగా ఉన్నాను.. అందరూ దాని గురించి ఎగతాళి చేసేవారు. మీకు కోడి కాళ్ళు ఉన్నాయి..అగ్గిపుల్లలా కనిపిస్తారు, మీకు t**లు లేవు .. మీకు a** లేదు.. అంటూ కామెంట్లు చేసారు. ప్రారంభంలో అలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాను.. అని తెలిపింది. అయితే ఎదిగే క్ర‌మంలో త‌న‌లో అన్నీ మారాయి. త‌న శ‌రీరం కూడా స‌హ‌జ అందాల‌తో నిండుకుండ‌లా మారింద‌ని చెప్పింది.

అందాలు విక‌సించాక కూడా విమ‌ర్శ‌లొచ్చాయి. అందాల‌ను స‌రి చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాన‌ని విమ‌ర్శించారు. నిజానికి ప్ర‌జ‌లు ఎప్పుడూ ఏదో ఒక‌టి అనేందుకు సిద్ధంగా ఉంటార‌ని నాకు అర్థ‌మైంది. అశాశ్వ‌త‌మైన అందానికి సినీరంగంలో ప్ర‌మాణాలు సెట్ చేసార‌ని అన‌న్య అన్నారు. చూడ‌టానికి అందంగా ఉంటారు.

హెయిర్ లుక్ మారుతుంది.. చాలా మార‌తాయి.. కానీ అవేవీ నిజాలు కావు! అని కూడా అన‌న్య అన్నారు. మహిళలు ఎప్పుడూ ఎందుకు గెలవలేరు? అనే దాని వెన‌క క‌ఠోర నిజాలు, తెరవెనుక వాస్త‌వాలపై అన‌న్య చాలా మాట్లాడింది. అన‌న్య పాండే ఇటీవ‌లే కేస‌రి 2లో కీల‌క పాత్ర‌లో న‌టించింది. జ‌లియన్ వాలాబాగ్ దురంతం అనంత‌రం కోర్టులో బ్రిటీష్ రాజ్ ని ప్ర‌శ్నించిన‌, శ్రీ‌ సి.శంక‌ర నారాయ‌ణ‌న్ జీవిత‌క‌థ‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.