బికినీ వేసుకుంటే ఏంటి?.. కంటెంట్ ఉంటేనే కదా..
బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు సినిమాల్లో బికినీల్లో సందడి చేస్తుంటారన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Dec 2025 10:00 PM ISTబాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు సినిమాల్లో బికినీల్లో సందడి చేస్తుంటారన్న విషయం తెలిసిందే. వెకేషన్స్ లో బికినీలు వేసుకుని చిల్ అవుతూ పిక్స్ షేర్ చేసే ముద్దుగుమ్మలు.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా వాటిలో కనిపిస్తుంటారు. అందుకు సంబంధించిన గ్లింప్సెస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
ఇప్పుడు యంగ్ బ్యూటీ అనన్య పాండే బికినీ లుక్ కూడా అలాగే ట్రెండ్ అవుతోంది. తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ మూవీలో బికినీలో సందడి చేయనున్న అమ్మడికి సంబంధించిన లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. లుక్ అదిరిపోయిందని, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫుల్ వైరల్ కూడా చేస్తున్నారు.
అయితే సమీర్ విద్వాన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్, నమహ్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఆ మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అనన్య. ఇప్పటికే మేకర్స్ సినిమా నుంచి టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా అనన్య గ్లామరస్ లుక్ అండ్ యాక్షన్ అంతా ఫిదా అయ్యారు. కచ్చితంగా హిట్ కొడుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు తన బికినీ లుక్ తో థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే అదేం నిజం కాదని మరికొందరు నెటిజన్లు చెబుతున్నారు.
ఎందుకంటే సినిమాలో హీరోయిన్ బికినీ వేసుకుంటే.. థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్లి చూస్తారంటే పొరపాటే. ఎవరో కొందరు వెళ్లి లుక్స్ ను ఎంజాయ్ చేస్తారు. కానీ అందరూ తరలివెళ్లాలంటే.. సినిమాలో కంటెంట్ ఉంటేనే.. పాజిటివ్ టాక్ వస్తేనే సాధ్యమవుతుంది. అది ఇప్పటికే ఎన్నో సినిమాలకు.. భారీ చిత్రాలకు కూడా జరిగిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా వచ్చిన వార్-2 మూవీలో కియారా అద్వానీ తన బికినీ లుక్ తో ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. కానీ ఏం లాభం? ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మూవీ తేలిపోయింది. అందుకే బికినీలు వేసుకున్నా.. కంటెంట్ ఉంటేనే సక్సెస్ దక్కుతుంది. మరి ఇప్పుడు అనన్య మూవీ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
