బాలీవుడ్ లో తెలుగమ్మాయి తెగించగలదా?
తాజాగా ఇదే వరుసలో మరో హైదరాబాద్ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్తోంది. 'మల్లేశం'తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల గురించి పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 7 April 2025 1:12 PM ISTఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో సౌత్ భామలు కూడా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిదే. స్థానిక భామల నుంచి పోటీ ని ఎదుర్కుని హిందీ పరిశ్రమలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు. హిందీ మార్కెట్ స్టార్ భామలకు ఏ మాత్రం తీసిపోకుండా రప్పాడిస్తున్నారు. సమంత, రష్మికా మందన్నా, కీర్తి సురేష్ ఇప్పటికే లాంచ్ అయి కొన్ని సినిమాలు కూడా చేసారు. ఇటీవలే తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది.
తాజాగా ఇదే వరుసలో మరో హైదరాబాద్ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్తోంది. 'మల్లేశం'తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. నటిగా తనకంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకుంది. ట్యాలెంటెడ్ బ్యూటీగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇంకా అమ్మడి ట్యాలెంట్ కి తగ్గ సరైన ఛాన్సులు పడలేదు. పడితే తానేంటో ప్రూవ్ చేసేది. అయితే అంతకంటే ముందే బాలీవుడ్ అమ్మడిని పిలిచింది.
ఏక్తా ఫిలింస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలోనే అవకాశం అందుకుంది. అనన్య ప్రధాన పాత్రలో రాకేష్ జగ్గి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇందులో అనన్య గిరిజన యువతి పాత్ర పోషిస్తుంది. అంటే డీగ్లామర్ గా తెరపై కనిపించాల్సి ఉంటుంది. గిరిజన యువతి అంటే రవిక ధరించరు. కేవలం సెమీసారీలో కనిపించాల్సి ఉంటుంది. గిరిజన యువతి ఆహార్యంలో ముస్తాబవ్వాల్సి ఉంటుంది.
ఇంతవరకూ అనన్యకి పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో కనిపించినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలకే పరిమితమైంది. నటిగా సరైన కంటెంట్ ఉన్న చిత్రం పడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వచ్చిన అవకాశం గొప్పదే. నటిగా తనని తాను ఆవిష్కరించుకోవడానికి అవకావం ఉంది. కాకపోతే పాత్ర విషయంలో కాస్త తెగించి నటించాల్సి ఉంటుంది.
