Begin typing your search above and press return to search.

అంబానీ కోడ‌లు రాధిక మ‌ర్చంట్ బ్యాక్ గ్రౌండ్?

By:  Tupaki Desk   |   4 March 2024 4:24 AM GMT
అంబానీ కోడ‌లు రాధిక మ‌ర్చంట్ బ్యాక్ గ్రౌండ్?
X

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని పెళ్లాడుతున్న ఆ అంద‌మైన యువ‌తి ఎవ‌రు? త‌న బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న ముచ్చట అప్ప‌టి నుంచి కొన‌సాగుతూనే ఉంది. దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది.

ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన‌ సంగ‌తి తెలిసిందే. జూలైలో రాధిక మ‌ర్చంట్ తో అనంత్ అంబానీ పెళ్లి జ‌ర‌గ‌నుంది. గుజరాత్ జామ్‌నగర్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నిర్వ‌హించిన‌ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలకు గ్లోబల్ టెక్ సీఈఓల నుండి ఇండస్ట్రీ టైటాన్స్ వరకు A-లిస్ట‌ర్ పాప్ సింగర్‌ల నుండి B-టౌన్ సెలబ్రిటీల వరకు అనేకమంది బిగ్ షాట్ లు దిగారు. రిలయన్స్ యాజమాన్యంలోని సంస్థల బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్న అనంత్ (28) జూలై 12న పారిశ్రామికవేత్త కుమార్తె అయిన మర్చంట్ (29)ని వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్ప‌టి నుంచి రాధిక ఎవ‌రు? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి.




రాధిక మర్చంట్ ప్ర‌ఖ్యాత‌ ఎంకోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు యజమానులుగా ఉన్న వీరేన్ మర్చంట్ - శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. రాధిక తండ్రి ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు CEO .. APL అపోలో ట్యూబ్స్, స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడు. ఆమె తల్లి శైలా ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. రాధిక అక్క అంజలి మర్చంట్ ఆకాష్ మెహతాను వివాహం చేసుకుంది. మెహ‌తా వ్యాపారవేత్త .. EYలో భాగస్వామి.

రాధిక మర్చంట్ తన పాఠశాల విద్యను కేథడ్రల్ , జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో పూర్తి చేసింది. రాధిక BD సోమని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా కూడా పొందారు. రాధిక న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, రాధిక మర్చంట్ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు. ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత, ఆమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్ లో చేరారు. రాధిక‌ భరతనాట్యం నృత్యంలో శిక్షణ కూడా పొందారు. జూన్ 2022లో రాధిక మర్చంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో తన `అరంగేత్రం` (మొదటి దశ ప్రదర్శన)ని ప్రదర్శించారు.

జంతు సంక్షేమం, పౌర హక్కులు, ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, మానవ హక్కులు, సామాజిక సేవ వంటివి రాధిక ఆసక్తులు. రాధిక మర్చంట్ - అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు. మీడియా కథనాల ప్రకారం.. అంబానీ నివాసానికి రాధిక తరచుగా అతిథిగా వచ్చేది. ఆమె 2018లో ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీ వివాహానికి .. 2019లో ఆకాష్-శ్లోకా వివాహానికి కూడా హాజరయ్యారు.