'మ్యాడ్' బ్యూటీ కరాటేలో బ్లాక్ బెల్ట్!
'మ్యాడ్' తో టాలీవుడ్ కి పరిచయమై మలయాళ ముద్దు గుమ్మ అనంతిక సునీల్ కుమార్.
By: Tupaki Desk | 16 Jun 2025 11:30 AM'మ్యాడ్' తో టాలీవుడ్ కి పరిచయమై మలయాళ ముద్దు గుమ్మ అనంతిక సునీల్ కుమార్. తొలి సినిమాతోనే అనంతిక మంచి హిట్ అందుకుంది. యువతలో క్రేజీ బ్యూటీ గా పాపులర్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ భామలదే క్రేజ్. దర్శక, నిర్మాతలు వాళ్లకిచ్చిన ప్రాధాన్యత ఇతర భాషలకు ఇవ్వడం లేదు. అయితే అనంతిక మాత్రం మ్యాడ్ తర్వాత అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది.
మంచి పెర్పార్మర్ అయినా? ఎందుకనో వెనుకబడింది. అయితే తాజాగా `8 వసంతాలు` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ సందర్బంగా అనంతిక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయా లు పంచుకుంది. నాకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా వచ్చాను. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. అందుకే క్లాసికల్ డాన్సర్ అయ్యాను. అలాగే కరాటే నేర్చుకున్నాను. కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించా.
కలిరియ పట్టు నేర్చుకున్నా. కానీ ఈ సినిమా కోసం మాత్రం వింగ్ చున్ అనే చైనా యుద్ద విద్యలో మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. ఇది నాకెంతో ఎగ్జైట్ మెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కళ లంటే ఆసక్తి తోనే ఇది సాధ్యమైంది. సినిమాల్లో నేను ఏం చేసినా అంతిమంగా ప్రేక్షకులకు మంచి సందేశం అందాలి.
బలమైన పాత్రల్లో నటించాలి. స్టోరీ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్దంగానే ఉన్నా. కానీ ఇలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఏ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించలేదు. వాటికి సిద్దంగానే ఉన్నాను. కానీ కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ బోర్డర్ దాటడానికి వీల్లు లేదని ముందే చెప్పేస్తా` అని తెలిపింది.