Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : బాద్‌షాను టెన్షన్ పెట్టిన అంబానీ

గత కొన్ని రోజులుగా ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 March 2024 10:54 AM GMT
వైరల్‌ వీడియో : బాద్‌షాను టెన్షన్ పెట్టిన అంబానీ
X

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అంబానీ వారి ఇంట పెళ్లి సందడి కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.

ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్టార్స్‌, సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులు హాజరు అయ్యారు. ప్రపంచ కుబేరులు హాజరు అయిన ఈ వేడుకలో బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా అనంత్‌ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో షారుఖ్‌ సందడి చేశారు.

ఆ సమయంలో అనంత్ అంబానీ తన వద్ద ఉన్న వైట్ కలర్‌ పామును షారుఖ్ ఖాన్ చేతికి ఇచ్చాడు. షారుఖ్ కాస్త టెన్షన్ పడుతూనే ఆ పామును పట్టుకున్నాడు. షారుఖ్ టెన్షన్ పడుతున్న సమయంలో రాధిక మర్చంట్‌ పక్కనే ఉండి గట్టిగా నవ్వేసింది.

ఆ తర్వాత వెనుక నుంచి కూడా షారుఖ్‌ మెడ పై కొందరు ఒక పామును వేయడం జరిగింది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో పాములతో పని ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు కాదేది వినోదానికి అనర్హం అన్నట్లుగా అంబానీ వారి వివాహ వేడుకలో పాములను కూడా ఆడిపించారా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి షారుఖ్‌ మరియు అనంత్‌ అంబానీ యొక్క పాము వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షారుఖ్ బ్లాక్‌ డ్రెస్ లో కూల్ అండ్‌ స్వీట్ గా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంబానీ ఫ్యామిలీ తో షారుఖ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధంతోనే షారుఖ్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో పాల్గొన్నాడు.

ముందు ముందు అంబానీ వారి ఇంటి పెళ్లి వేడుకలో ఎలాంటి సిత్రాలు చూడాల్సి ఉంటుందో.. మరెన్ని వైరల్‌ వీడియోలు బయటకు వస్తాయో అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఇంత వైభవంగా ఉంటే పెళ్లి ఇంక ఎలా ఉంటుందో చూడాలి.