Begin typing your search above and press return to search.

హీరోయిన్ ని బోల్డ్ సీన్స్ లో ఎంకరేజ్ చేసిన హస్బండ్..!

ఈ సినిమా కథ విన్నప్పుడు సినిమాలో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని కాదని చెప్పిందట ఆనంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ సినిమా చేయమని ఎంకరేజ్ చేశారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆనంది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 12:30 AM GMT
హీరోయిన్ ని బోల్డ్ సీన్స్ లో ఎంకరేజ్ చేసిన హస్బండ్..!
X

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆనంది తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసినా ఇక్కడ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ తమిళంలో మాత్రం ఆనందికి మంచి పాపులారిటీ వచ్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఆనంది. అయితే హీరోయిన్ గా చేస్తూనే కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది ఆనంది. తెలుగులో జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాల్లో నటించింది ఆనంది. తెలుగులో ఆమె నటనకు సరైన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు.

తెలుగు అమ్మాయి అయిన ఆనంది కోలీవుడ్ లో మాత్రం దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఆనంది మంగై సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు సినిమాలో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని కాదని చెప్పిందట ఆనంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ సినిమా చేయమని ఎంకరేజ్ చేశారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆనంది. మంగై సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. మున్నార్ నుంచి చెన్నై కి వెళ్తున్న అమ్మాయి ఎలా పరిస్థితులను ఎదుర్కొన్నది అన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఒంటరిగా ఉన్న మహిళలను మగాడు చూసే కోణంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కథ విన్నప్పుడు మంగై సినిమాను చేయకూడదని అనుకున్నా భర్త ప్రోత్సాహం వల్లే ఈ సినిమా పూర్తి చేశానని అంటుంది ఆనంది. పెళ్లైన వ్యక్తిగా కాకుండా ఒక నటిగా పాత్ర గురించి ఆలోచించి సినిమా చేయమని ఆనంది భర్త ఎంకరేజ్ చేశారట. అందుకే ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది ఆనంది.

తెలుగు అమ్మాయిలు తమిళంలో రాణించడం కొత్తేమి కాదు. ఇదివరకు చాలా మంది భామలు కోలీవుడ్ లో తమ సత్తా చాటారు. అయితే తెలుగు హీరోయిన్స్ కు తెలుగు ఛాన్స్ లు మాత్రం కష్టంగా మారాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మారుతుంది. ఆనంది లాంటి ప్రతిభ గల అమ్మాయికి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తే చూడాలని అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్. తెలుగులో ఆనంది సినిమాలు చేస్తున్నా ఆమె చేసినవేవి కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఆమె తో సినిమా అంటే దర్శక నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించట్లేదు. సరైన అవకాశం వస్తే చాలు ఆనంది తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.