'డ్రాగన్' లో టాలీవుడ్ నేచురల్ బ్యూటీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాలో `డ్రాగన్` తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 1:30 AMయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాలో `డ్రాగన్` తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ కి జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. సౌత్ భామల్ని హీరో యిన్లగా ఎంపిక చేయడం అన్నది ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్. `కేజీఎఫ్` లో శ్రీనిధి శెట్టి అలాగే ఛాన్స్ అందుకుంది. అటుపై తీసిన `సలార్` లోనూ శ్రుతి హాసన్ కి అలాగే అవకాశం వచ్చింది.
`డ్రాగన్` సెట్స్ లో ఉన్న సమయంలో రుక్మిణీ వసంత్ కి తెలుగు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. నిర్మాతలు అడ్వాన్స్ లు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా బలమైన పాత్రలు కనిపించనున్నాయి. ఇదే చిత్రంలో తెలుగు నటి ఆనంది కి కూడా ఛాన్స్ వచ్చిందిట. అమ్మడిని ఓ కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఆనంది పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు.
ఇదే నిజమైతే ఆనంది కెరీర్ టర్నింగ్ తీసుకున్నట్లే . ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలకు మాత్రం దూరంగానే ఉంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన సరైన అవకాశాలు రాకపోవడంతో పెద్దగా వెలుగులో కి రాలేకపోయింది. కానీ డ్రాగన్ అవకాశం గనుక నిజమైతే ఆనంది కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. సక్సస్ అయితే పాన్ ఇండియాలో గుర్తింపు దక్కుతుంది.
ఇటీవలే రిలీజ్ అయిన `భైరవం`లో ఆనంది నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతానికి తమిళ్ అవకాశాలు కూడా చేతిలో లేవు. ఈ నేపథ్యంలో `డ్రాగన్` ఛాన్స్ అమ్మ డికి బిగ్ రిలీఫ్ అనొచ్చు. ఆనంది కెరీర్ ప్రారంభించి ఇప్పటికే దశాబ్ధం దాటిన సంగతి తెలిసిందే.