Begin typing your search above and press return to search.

ఏ గొడవకైనా విజయ్ ఫస్ట్ తీసుకెళ్లేది తమ్ముడినే!

కొవిడ్ టైంలో ఓటీటీలో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీతో సందడి చేసి ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   15 March 2024 11:28 AM GMT
ఏ గొడవకైనా విజయ్ ఫస్ట్ తీసుకెళ్లేది తమ్ముడినే!
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దొరసాని మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్.. తన నటనతో ఆకట్టుకున్నారు. కానీ డెబ్యూతో సాలిడ్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోయారు. కొవిడ్ టైంలో ఓటీటీలో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీతో సందడి చేసి ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చారు.


ఆ తర్వాత పుష్పక విమానం, హైవే వంటి సినిమాల్లో ఆనంద్ నటించినా.. అనుకున్నంత స్థాయిలో ఆ మూవీలు మెప్పించలేక పోయాయి. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ చిత్రంలో నటించారు. కల్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ.. రూ.100 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్కసారిగా ఆనంద్ కెరీర్ మలుపు తిప్పేసింది. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు ఆనంద్.

విభిన్నమైన కథలతో అలరించే ఆనంద్ బర్త్ డే నేడే. దీంతో ఆయనకు ఫ్యాన్స్ తోపాటు సెలబ్రిటీలు విషెస్ తెలుపుతున్నారు. ఆనంద్ అన్నయ్య, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆనంద్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరూ మజిల్స్ చూపిస్తున్నారు. "ఏదైనా గొడవ అయితే.. నాతో పాటు ఫస్ట్ తీసుకెళ్లే అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. ల‌వ్ యూ అంటూ రౌడీ హీరో" అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ బ్రదర్స్ క్రేజీ పిక్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరూ గట్టిగా జిమ్ చేస్తున్నట్లున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఆనంద్ ప్రస్తుతం డ్యూయెట్ మూవీతో పాటు బేబీ కాంబోలో మరో సినిమా చేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా డ్యూయెట్ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆనంద్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి విషెస్ తెలిపారు. ఆనంద్ సరసన రితికా నాయక్ నటిస్తోంది.

మరోవైపు, విజయ్ దేవరకొండ త్వరలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత విజయ్.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కంటిన్యూ చేయనున్నారు. మరి రౌడీ బ్రదర్స్.. తమ కొత్త చిత్రాలతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.