Begin typing your search above and press return to search.

మదన్ గా ఆనంద్.. మనసంతా ప్రియురాలే!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ.

By:  Tupaki Desk   |   15 March 2024 9:14 AM GMT
మదన్ గా ఆనంద్.. మనసంతా ప్రియురాలే!
X

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ. అతి తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ.. తనదైన శైలిలో అలరిస్తున్నారు. తన రూటే సెపరేట్ అన్నట్లు వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.


సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్ట్ లవ్ స్టోరీ బేబీ.. గతేడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్ తో రూపొంది.. భారీ లాభాలు సంపాదించింది. రెండు నెలల పాటు థియేటర్లలో రన్ అయిన ఈ మూవీతో ఆనంద్ దేవరకొండ కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు ఆయన మరో లవ్ స్టోరీ డ్యూయెట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మిథున్ వరదరాజ కృష్ణన్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. హాయ్ నాన్న ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా డ్యూయెట్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. యంగ్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనంద్ పోషిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్‌ ను రివీల్ చేశారు.

మనసంతా ప్రియురాలను నింపుకున్న యువకుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్‌ లో కనిపిస్తున్నారు. పోస్టర్ అంతా ఆనంద్ ఉండగా.. మధ్యలో హీరోయిన్ కారిడార్ వద్ద నవ్వుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రివ్యూలు వస్తున్నాయి. చాలా రిఫ్రెషింగ్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ ను రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం డ్యూయెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే విడుదల కానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సహా నిర్మాతగా మధుర శ్రీధర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. డిఫరెంట్ ప్రేమ కథగా రూపొందుతున్న ఈ డ్యూయెట్ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలా అలరిస్తారో చూడాలి మరి.