బ్రదర్ ఆఫ్ దేవరకొండని టచ్ చేసిన సాంగ్..!
విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ లో తన అన్న విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
By: Tupaki Desk | 18 July 2025 7:44 PM ISTవిజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ లో తన అన్న విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దానితో పాటు లేటెస్ట్ గా కింగ్ డమ్ నుంచి రిలీజైన సాంగ్ ని దానితో యాడ్ చేశాడు. కింగ్ డమ్ సినిమా నుంచి అన్న అటేనే ఉన్నానంటూ సాంగ్ రిలీజైంది. అనిరుద్ రవిచందర్ అద్భుతమైన కంపోజింగ్ తో ఈ సాంగ్ వచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ల మధ్య ఈ సాంగ్ ఉంటుంది.
ఐతే ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఆల్రెడీ సోషల్ మీడియాలో బ్రదర్స్ అంతా కలిసి సాంగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఐతే బ్రదర్ ఆఫ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండకు కూడా ఈ సాంగ్ బాగా నచ్చేసిందట. అందుకే తన బ్రదర్ తో ఉన్న చైల్డ్ మెమొరీస్ అన్నిటినీ ఒకచోట చేర్చి ఈ సాంగ్ ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆనంద్ షేర్ చేసిన ఈ ఫోటోస్ అన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ కూడా తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత కెరీర్ మీద స్పెషల్ ఫోకస్ చేశాడు ఆనంద్ దేవరకొండ.
విజయ్ దేవరకొండలా తను కూడా కెరీర్ పరంగా ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు ఆనంద్. ప్రస్తుతం అతను వైష్ణవి చైతన్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్, ఆనంద్ ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్న మీద ప్రేమతో తమ్ముడు.. తమ్ముడంటే ప్రాణంగా అన్న ఇద్దరు తమ ప్రతి వేడుకని ఫ్యాన్స్ తో పంచుకుంటారు. ప్రత్యేకంగా కింగ్ డం లోని ఈ సాంగ్ తో అన్న విజయ్ తో తన జ్ఞాపకాలను షేర్ చేసుకుని దేవరకొండ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ఆనంద్. ఇక కింగ్ డం సినిమా విషయానికి వస్తే సినిమాతో విజయ్ మాస్ హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాపై బజ్ పెంచింది.
