దేవరకొండ ఇంట్లో ఇలా..
అయితే ఆనంద్.. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 16 April 2025 5:44 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తక్కువ టైమ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆనంద్.. బేబీ మూవీతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు.
అయితే ఆనంద్.. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఇంట్లో తీసిన వీడియోను షేర్ చేశారు. అందులో తన పేరెంట్స్ తో పాటు పెట్ డాగ్ కూడా ఉంది. అదే వీడియోకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎంతో క్యూట్ గా ఉన్న పెట్.. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తూనే ఉంది.
ఇంట్లో తమ పెట్ ఎక్కువగా మాట్లాడుతుందని తెలిపారు ఆనంద్ దేవరకొండ. అందరి మీద ప్రేమ చూపిస్తుందని అన్నారు. ఫ్యామిలీ డ్రామా.. మామ్స్ పొయిట్రీ.. డాగ్ లవ్.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ పోస్ట్ చేసిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పెట్ క్యూట్ గా ఉందని, బాండింగ్ చాలా బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.
ఇక ఆనంద్ కెరీర్ విషయానికొస్తే.. దొరసాని మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బేబీతో కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు. గత ఏడాది గం గం గణేశా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ నిరాశపరిచారు.
అంతకుముందు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి దొరసాని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.. ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ మూవీని స్టార్ట్ చేశారు. మిథున్ వరద రాజ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత బేబీ మేకర్స్ తో మరో మూవీకి ఆనంద్ దేవరకొండ కమిట్ అయ్యారు.
రీసెంట్ గా ఆనంద్, వైష్ణవి చైతన్య జోడీగా మిడిల్ క్లాస్ కుర్రాడి లవ్ స్టోరీని సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సినిమాకు నైన్టీస్: మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలా ప్రస్తుతం చేతిలో వివిధ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
