Begin typing your search above and press return to search.

బేబీని తిడుతున్నారు.. కానీ..

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం బేబీ. వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా టైటిల్ పాత్ర‌లో న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు.

By:  Tupaki Desk   |   15 July 2023 6:54 AM GMT
బేబీని తిడుతున్నారు.. కానీ..
X

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం బేబీ. వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా టైటిల్ పాత్ర‌లో న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న`క‌ల‌ర్ ఫొటో` సినిమాకు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. ఓ కొత్త క‌థ‌ని చెబుతున్నార‌నే ఫీల్ ని ప్రేక్ష‌కుల‌కు చేర‌వేయ‌డంలో నూటికి నూరు శాతం స‌క్సెస్ అయింది.

ఓవ‌ర్సీస్‌లో గురువార‌మే ప్రీమియ‌ర్స్ ప‌డిపోయాయి. సూప‌ర్ హిట్ టాక్ కూడా వ‌చ్చేసింది. ఓ స్ల‌బ్ ఏరియా యువ‌తి క‌థ‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `మొద‌టి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు. మ‌న‌సు పొర‌ల్లో శాశ్వ‌తంగా స‌మాధి చేయ‌బ‌డుతుంది` అనే ప్ర‌ధాన కాన్సెప్ట్‌తో ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మొద‌టి రోజే సూప‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది.

అంతేకాదు, మూవీ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాలోని క్యారెక్టర్ల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుటున్నారు. దర్శకుడు సినిమాను చూపించిన విధానం చాలా మందికి నచ్చేసింది. ఇక చాలా మంది తమను తాము ఈ సినిమాలో చూసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె క్యారెక్టర్ ని తిట్టుకుంటున్నారు. కానీ, ఆమె నటనకు , అందానికి మాత్రం ఫిదా అయిపోతున్నారు.

నిజానికి, ఇలాంటి మూవీ అందరు ఆడియన్స్ కోసం తీసిన మూవీ కాదు. కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తీశారు. తమిళంలో ఇలాంటి పర్టిక్యులర్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బేబీ కూడా ఈ కోవలోకి చెందినదే. వారు అనుకున్నట్లే, ఆ లక్ష్యాన్ని కూడా చేరుకున్నారనే చెప్పొచ్చు.

ఇక ఈ బేబీ చిన్న సినిమాల్లో పెద్ద మూవీగా విడుద‌లై ప్రీమియ‌ర్స్ నుంచే అంచ‌నాల్ని పెంచేసింది. జూలై 13న యుఎస్ లో ప్రీమియ‌ర్స్ వేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పెయిడ్ ప్రీమియ‌ర్స్ వేయ‌డం,వాటికి భారీ స్పంద‌న ల‌భించ‌డంతో `బేబీ` మూవీ టీమ్ చాలా హ్యాపీగా ఉంది. ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్స్ డే వ‌న్ అడ్వాన్స్ సేల్ ప‌రంగా 100కె ప్ల‌స్ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం విశేషం. మరి ఈ మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.