Begin typing your search above and press return to search.

నవీన్ పోలిశెట్టి.. ఆ సినిమా ఏమైనట్టు?

జాతిరత్నాలు తర్వాత వీడియో రిలీజ్ చేసి మరీ అట్టహాసంగా అనౌన్స్ చేసిన 'అనగనగా ఒక రాజు' సినిమా మాత్రం ఊసే లేదు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 2:30 PM GMT
నవీన్ పోలిశెట్టి.. ఆ సినిమా ఏమైనట్టు?
X

నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడీ పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఆన్ స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్​.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ కచ్చితంగా ఉండాల్సిందే. తన మార్క్ కామెడీతో బాగా నవ్వులు పూయిస్తారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు విజయాలు అందుకున్న తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రీసెంట్ గా థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకుంది. అలా ఆయన ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఆయన డిమాండ్ కూడా పెరిగిపోయంది.

ఆయన కెరీర్ గమనిస్తే.. మిగతా యంగ్ హీరోల్లో స్పీడ్ స్పీడ్ గా సినిమాలు చేస్తూ వెళ్లరు. 2012లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత అదే ఏడాది హిందీ చిత్రం ఛిచోరేలో నటించారు. ఇక రెండేళ్లు గ్యాప్ తీసుకుని జాతీరత్నాలుతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. అనంతరం మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకుల్ని పలకరించారు. అంటే ఐదేళ్లలో మొత్తం మూడు చిత్రాలే చేశారు.

ఈ మూడు చిత్రాలు హిట్ కావడం విశేషం. దీన్ని బట్టి నవీన్ ఎంత కాల్కులేటెడ్​గా ఆచితూచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు నవీన్ కు డిమాండ్ పెరగడంతో ఆయనతో దర్శకనిర్మాతలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే నవీన్ కూడా... ప్రస్తుతం తన చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి స్క్పిప్ట్స్ లాక్ అయినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయని అన్నారు. హిందీలో రెండు మూడు కథలు విన్నట్లు తెలిపారు.

అయితే లాక్ అయిన స్క్రిప్ట్ల్ లో ఒకటి మైత్రి మూవీస్ బ్యానర్ లో అని అర్థమైపోయింది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ కూడా ఓ ఫొటో ట్వీట్ తో క్లారిటీ చేసింది. ఇక షైన్ స్క్రీన్​తో పాటు ఇతర బ్యానర్ లో ఇతర సినిమాలు ఉన్నాయని తెలిసింది. నిర్మాత దిల్ రాజుతో ఓ చిత్రం, తన జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందించిన దర్శకుడు అనుదీప్ తో కూడా మరో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి నవీన్ వచ్చే ఏడాది మరింత బిజీగా మారనున్నారని తెలుస్తోంది.

అయితే నవీన్.. కొత్త చిత్రాలను లైన్ లో పెడుతున్నారు కానీ... జాతిరత్నాలు తర్వాత వీడియో రిలీజ్ చేసి మరీ అట్టహాసంగా అనౌన్స్ చేసిన 'అనగనగా ఒక రాజు' సినిమా మాత్రం ఊసే లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్​పై ఈ చిత్రం తెరకెక్కాల్సింది.

కానీ ఈ సినిమా ఆగిపోయిన్లు ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనిపై తాజా ఇంటర్వ్యూలోనూ నవీన్ క్లారిటీ ఇవ్వలేదు. ఇతర నిర్మాణ సంస్థలు మాత్రం అతడితో సినిమాలు చేసేందుకు పోటీపడుతుంటే.. సితార మాత్రం రెండేళ్ల క్రితమే నవీన్ తో సినిమాను అనౌన్స్ చేసి ఇప్పుడు అతడు మరింత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నవీన్ మాత్రం తన మార్క్ కామెడీ యాక్టింగ్ తో స్లోగా వస్తున్నా హిట్లను అందుకుంటూ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్నారు.