అనగనగా నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందా?
రీసెంట్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన అనగనగా అనే సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
By: Tupaki Desk | 24 May 2025 3:46 PM ISTఇంతకుముందు ఏదైనా సినిమాలు చూడాలంటే థియేటర్లోనే చూడాలి. లేదంటే టీవీ ఛానెల్స్ లో చూడాలి. కానీ మారుతున్న జెనరేషన్ లో భాగంగా ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయి. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు సైతం ఈ ఓటీటీల్లోనే చూస్తున్నారు ఆడియన్స్. కరోనా ద్వారా ఈ ఓటీటీల వాడకం బాగా పెరిగింది.
థియేటర్ రిలీజ్ కు ఇబ్బంది పడే ఎన్నో సినిమాలకు ఓటీటీలు దేవాలయాల్లా కనిపిస్తున్నాయి. అందుకే కోవిడ్ నుంచి చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి. అంతేకాదు, థియేటర్ రన్ తర్వాత కూడా కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజవుతుండటం చాలా కామన్. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో ఓటీటీలో రిలీజైన ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లబోతుంది.
రీసెంట్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన అనగనగా అనే సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఫ్రీ ప్రీమియర్లు వేస్తే అవి కూడా హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే అనగనగా సినిమాకు పెయిడ్ షో లు వేయనున్నట్టు ఆ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన సుమంత్ తెలిపాడు.
అయితే ఓటీటీలో రిలీజైన సినిమా ఇలా థియేటర్లలో రిలీజ్ చేయడం ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా కొన్ని సినిమాలను ఇలానే చేశారు కానీ అవేమీ పెద్దగా క్లిక్ అవలేదు. కానీ అనగనగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆ సినిమా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న అనగనగా ఓ కొత్త ట్రెండ్ కు తప్పకుండా నాంది పలుకుతుందని మేకర్స్ కాన్ఫిడంట్ గా ఉన్నారు. ఒకవేళ మ్యాజిక్ జరిగి థియేటర్లలో కూడా ఈ సినిమా హిట్ అయితే పలువులు దీన్ని ఫాలో అయ్యే ఛాన్సుంది. అలా అని ఏ సినిమాను పడితే ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ అయ్యాక థియేటర్లలోకి తీసుకొచ్చి రిలీజ్ చేస్తే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే అనగనగా థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
