సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులు.. పోలిశెట్టి 'అనగనగా' డేట్ ఫిక్స్
ఇప్పుడు మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ విడుదల తేదీని సోమవారం అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 26 May 2025 5:27 PMటాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి పలు సినిమాలతో హిట్స్ కొట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో బిజీగా ఉన్నారు.
నిజానికి.. అనగనగా ఒక రాజు సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ నవీన్ కు యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం మేకర్స్ సడెన్ అప్డేట్ ఇచ్చారు. ప్రీ వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో అందరి ఫోకస్ మూవీపై పడింది. అదే సమయంలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ఇప్పుడు మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ విడుదల తేదీని సోమవారం అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. 2026 జనవరి 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అలా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ను వీడేలా చేశారు.
అదే సమయంలో మోషన్ పోస్టర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పండుగ లాంటి వాతావరణంతో మోషన్ పోస్టర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతోంది.. ఆరడుగుల అందగాడు.. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేవాడు.. అమ్మాయిల గుండెచప్పుడు.. టెన్షనెందుకు దండగ.. రాజు గారు ఎక్కడుంటే అక్కడ పండుగ అంటూ ఇంట్రో ఇచ్చారు.
ఇంతలో నవీన్ పోలిశెట్టి బుల్లెట్ బైక్ పై ఎంట్రీ ఇచ్చారు. లుంగీ, బనియన్, తువ్వాలు.. నోట్లో బీడీ.. నవీన్ లుక్ క్రేజీగా ఉందనే చెప్పాలి. మోషన్ పోస్టర్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మంచి ఫెస్టివల్ మోడ్ తో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మోషన్ పోస్టర్ కు అందించారని కొనియాడుతున్నారు.
మూవీని సరైన టైమ్ కే రిలీజ్ చేస్తున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే మారి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో దిగే అనగనగా ఒక రాజు మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.