Begin typing your search above and press return to search.

అమైరా గ్లామర్ లుక్.. కెవ్వు కేక!

రీసెంట్ గా అమ్మడు స్టైలిష్ డ్రెస్ లో తన ఎద అందాలను అలాగే లెగ్స్ అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది.

By:  Tupaki Desk   |   6 July 2023 11:30 PM GMT
అమైరా గ్లామర్ లుక్.. కెవ్వు కేక!
X

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే క్యూట్ బ్యూటీ అమైరా దస్తూర్. ఈ బాంబే అమ్మాయి తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ కూడా ఓ వర్గం కుర్రాళ్లను మాత్రం ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఇక బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ లేకుండా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.


మోడల్ గా మొదట్లో గుర్తింపును అందుకున్న అమైరా దస్తూర్ ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక 2013 నుంచి సినిమా ప్రపంచంలో కొనసాగుతున్న ఈ బ్యూటీ ట్రాక్ తో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు అయితే అందుకుంటుంది. ఇక మొదట్లోనే ఆమెకు హిందీ తమిళ్ అలాగే తెలుగులో అవకాశాలు చాలా వేగంగానే వచ్చాయి.

ముఖ్యంగా తెలుగులో ఆమె మనసుకు నచ్చింది అని సినిమా చేసింది. మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ కూడా ఆ.అమ్మాయి తెలుగువారిని బాగానే అట్రాక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ తో రాజుగాడు అనే ఒక సినిమా చేసింది. అది కూడా అంతగా ఈ బ్యూటీకి సక్సెస్ అయితే ఇవ్వలేదు.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో నిత్యం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు స్టైలిష్ డ్రెస్ లో తన ఎద అందాలను అలాగే లెగ్స్ అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో బికినీలో కూడా కనిపించిన ఈ బ్యూటీ ఈ డ్రెస్ లో మాత్రం అంతకుమించి అనేలా ఉంది అంటూ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

ఆమె ఫాలోవర్స్ అయితే ఈ ఫోటోలు చూసి ఫీదా అవుతున్నారు. ఇక ఆమె నిలుచున్న స్టైలిష్ పోజ్ కూడా అద్భుతంగా ఉంది అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక అమైరా దస్తూర్ ప్రస్తుతం చేతిలో అయితే ఎలాంటి సినిమాలు లేవు. చివరగా ఆమె హిందీలోనే భగీర అనే సినిమా చేసింది. కానీ అదేమీ కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడికి ఏమైనా కొత్త అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.