Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : రాజుగాడి లవర్‌ అందాల జోరు చూశారా?

తాజాగా అమైరా దస్తూర్‌ సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   28 July 2025 11:00 PM IST
పిక్‌టాక్‌ : రాజుగాడి లవర్‌ అందాల జోరు చూశారా?
X

సందీప్‌ కిషన్‌ హీరోగా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. మొదటి సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా నటిగా మెప్పించింది. అందంతో ఆకట్టుకుంది. క్లాస్‌ పాత్రలకు బాగా సెట్‌ అవుతుందనే రివ్యూలు దక్కించుకుంది. మనసుకు నచ్చింది సినిమా తర్వాత అమైరాకు తెలుగులో పలు ఆఫర్లు వచ్చినప్పటికీ రాజ్ తరుణ్‌ హీరోగా నటించిన రాజు గాడు సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అమైరాకు కమర్షియల్‌గా నిరాశను మిగిల్చింది. దాంతో అమైరా దస్తూర్‌ తెలుగులో మళ్లీ నటించాలని అనుకోలేదని, హిందీ సినిమాలకు పరిమితం అయిందని తెలుస్తోంది.


వరుసగా హిందీ సినిమాలు చేసిన అమైరా దస్తూర్‌ ఈ మధ్య కాలంలో తమిళ్‌, పంజాబీ సినిమాలను సైతం చేస్తుంది. గత ఏడాదిలో ఈమె నటించిన పంజాబీ సినిమా వచ్చింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఆ సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. అయితే 2025 లో అమైరా నుంచి సినిమాలు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ రెగ్యులర్‌గా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. తాజాగా అమైరా దస్తూర్‌ సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్న సమయంలోనే ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ పై కనిపించి సందడి చేసింది.


అందమైన అమైరా దస్తూర్‌, అంతకు మించిన అందమైన ఔట్ ఫిట్‌లో కనిపించింది. ట్రెడీషనల్‌ కమ్‌ స్కిన్‌ షో చేయడం ద్వారా ఈ కవర్‌ పేజ్‌ స్టిల్స్‌ లో అమైరా దస్తూర్ ఆకట్టుకుంది. అందమైన అమైరా దస్తూర్‌ ఈ కవర్‌ ఫోటోలో అంతకు మించి అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి అందాల జోరుకు చాలా మంది బేజారు అవుతున్నారు. ఇంత అందంగా ఉన్న అమైరా దస్తూర్‌ కి దక్కాల్సిన గుర్తింపు టాలీవుడ్‌లో దక్కలేదని, రావాల్సిన ఆఫర్లు సినిమా ఇండస్ట్రీ లో రావడం లేదని నెటిజన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా అమైరా దస్తూర్‌ వరుసగా సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


మహారాష్ట్రలోని ముంబైలో ఒక పార్శీ కుటుంబంలో జన్మించిన అమైరా దస్తూర్‌ యొక్క మాతృ భాష గుజరాతీ. ఈ అమ్మడు కమర్షియల్‌ యాడ్స్‌ లో మోడల్‌గా నటించడం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా ఈమె ఎంట్రీ ఇవ్వడం ద్వారా అక్కడ ఇక్కడ పాపులర్‌ కావాలని ప్రయత్నాలు చేసింది. సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడంతో పాటు, ప్రత్యేక పాటల్లోనూ అమైరా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె హాలీవుడ్‌ మూవీ కుంగ్‌ ఫూ యోగాలో కీలక పాత్రలో నటించడం ద్వారా విదేశీ ప్రేక్షకులకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ అది వర్కౌట్‌ కాలేదు. తమిళ్‌ లో ధనుష్‌ తో కలిసి నటించినా ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కలేదు.