ఒంటరి దీవిలో యంగ్ బ్యూటీ బికినీ ట్రీట్!
బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో స్టార్లు మరిగిస్తున్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవుల్లో మంటలు పెట్టేందుకు అందాల భామలు వెనకాడటం లేదు.
By: Tupaki Desk | 12 May 2025 10:31 AM ISTబికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో స్టార్లు మరిగిస్తున్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవుల్లో మంటలు పెట్టేందుకు అందాల భామలు వెనకాడటం లేదు. ఇప్పుడు తన బర్త్ డే వేడుకల్ని పురస్కరించుకుని యంగ్ బ్యూటీ అమైరా దస్తూర్ బీచ్ పరిసరాల్లో చెలరేగిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా అమైరా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు యువతరం వాట్సాపుల్లోకి వచ్చాయి. అమైరా అందచందాలు, టీజింగ్ యాటిట్యూడ్ కి ఫిదా కాని వాళ్లు లేరు. ఈ ఏడాదితో అమైరా 32 బార్డర్ క్రాస్ చేస్తోంది. ఇప్పటికే చాలా సాధించాల్సి ఉన్నా, నటిగా కెరీర్ అంతంత మాత్రమే. కానీ మోడలింగ్ లో టాప్ క్వీన్ గా వెలిగిపోతోంది. నిరంతరం అమైరా రెడ్ కార్పెట్ ఈవెంట్లలో సందడి చేస్తూనే ఉంది. శ్రీలంక దీవుల్లో బికినీ షూట్లకు సంబంధించిన ఫోటోలు హీటెక్కిస్తున్నాయి.
అమైరా తెలుగు చిత్రసీమలో అవకాశాలు అందుకుంది. ముంబై బ్యూటీ అమైరా దస్తూర్ `మనసుకు నచ్చింది` సినిమాతో టాలీడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై రాజ్ తరుణ్ `రాజుగాడు` లో నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాపయ్యాయి. కోలీవుడ్ లో భగీరా అనే చిత్రంలో నటించింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లతోను బిజీ అయింది. 2017లో జాకీ చాన్‌తో కలిసి తన అంతర్జాతీయ ప్రాజెక్ట్ కుంగ్ ఫూ యోగాలో నటించడం ద్వారా క్రేజ్ తెచ్చుకుంది. కానీ అది బాలీవుడ్ కెరీర్ కి కలిసి రాలేదు. ప్రస్తుతం కెరీర్ బండిని ట్రాక్ లో పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది అమైరా. నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు, ఫిలింమేకర్స్ కి టచ్ లో ఉంది.
