Begin typing your search above and press return to search.

అమీజాక్స‌న్ కెరీర్ కి సెకెండ్ ఛాన్స్ ఇది!

తాజాగా నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ. ఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న 'మిష‌న్ చాప్ట‌ర్ వ‌న్' లో న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 12:30 PM GMT
అమీజాక్స‌న్ కెరీర్ కి సెకెండ్ ఛాన్స్ ఇది!
X

బ్రిట‌న్ బ్యూటీ అమీజాక్స‌న్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. శంక‌ర్ సినిమాల‌ తో ఫేమ‌స్ అయిన బ్యూటీ అటు పై సాగిన కెరీర్ ఎంతో ఆస‌క్తిక‌రం. సినిమాల్లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఏ భాష‌లోనూ బిజీ న‌టి కాలేదు. నాలుగు భాష‌ల్లో న‌టించినా అమ్మ‌డి కెరీర్ వృత్తి ప‌రంగా ఏమాత్రం ఎదుగుద‌ల లేనేలేదు.


అటు పై అమీజాక్సన్ వ్య‌క్తిగత జీవితం గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. విదేశీ క‌ల్చ‌ర్ లో భాగంగా పెళ్లి కాకుండా పిల్ల‌ల్ని క‌న‌డం.. ఆత‌ర్వాత బోయ్ ప్రెండ్ తో వివాదాలు..విడిపోవ‌డం ప్ర‌తీది అమీ జాక్స‌న్ కెరీర్ లో చేదు అనుభ‌వాలు గానే క‌నిపిస్తాయి.

అయినా అమ్మ‌డు మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. వృత్తి ప‌రంగా అనుకున్న‌ది సాధించ‌క పోయినా..వ్య‌క్తిగ‌త జీవితం లో ఫెయిలైనా! త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌డం లేదు. మొక్క‌వోని దిక్ష‌తో అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. తాజాగా నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ. ఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న 'మిష‌న్ చాప్ట‌ర్ వ‌న్' లో న‌టిస్తోంది. ఇందులో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా అమీ న‌టిస్తోంది.

ఆ ర‌కంగా ఏ.ఎల్ విజ‌య్ అమ్మ‌డికి సెకెండ్ లైఫ్ ఇస్తున్నాడు. అమీజాక్స‌న్ డెబ్యూ మూవీ ఏ.ఎల్ విజ‌య్ తోనే చేసింది. అదే 'మ‌ద్రాస్ ప‌ట్ట‌ణం'..ఆ త‌ర్వాత న‌టిగా కొన్ని సినిమాలు చేసింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఎవ‌రూ ఆవ‌కాశాలు ఇవ్వ‌క‌పోయినా విజ‌య్ త‌న సినిమా లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా అయినా అమీ కెరీర్ ని ప‌ట్టాలెక్కిస్తుందేమో చూడాలి. ఇలా సినిమా చేయ‌డంతో అమీజాక్స‌న్ పేరు మ‌ళ్లీ సౌత్ లో వినిపిస్తోంది.

ఇక సోషల్ మీడియా లో నిత్యం అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంటుంది. టెంప్టింగ్ ఫోటోల‌తో త‌న‌దైన శైలి లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతూనే ఉంటాయి. తాజాగా బోట్ లో షికారు చేస్తోన్న ఫోటోలు నెట్టింట వ‌దిలింది. అందులో అమీజాక్స‌న్ బ్లాక్ స్విమ్ షూట్ ధ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఆ స్విమ్ షూట్ వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ తో క‌వ‌ర‌ప్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.