Begin typing your search above and press return to search.

శివ న‌మ‌స్కారంతో చిక్కిన చిన్న‌ది!

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మిష‌న్ చాప్ట‌ర్ వ‌న్` లో మ‌రోసారి ఛాన్స్ ఇవ్వ‌డంతో ఐదేళ్ల త‌ర్వాత అమీ మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 4:30 PM GMT
శివ న‌మ‌స్కారంతో చిక్కిన చిన్న‌ది!
X

బ్రిటన్ బ్యూటీ అమీజాక్స‌న్ మ‌ళ్లీ కంబ్యాక్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. వ‌రుస ప‌రాజ‌యాలు.. దానికి తోడు సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌తంగా ఎదుర్కున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మ‌నుకున్నారు. అమీజాక్సన్ ని ప్రోత్స‌హించి అవ‌కాశాలిచ్చేది ఎవ‌రు? అనుకున్నారంతా. కానీ అమీజాక్స‌న్ కోసం నేను ఉన్నాను అంటూ ఏ.ఎల్ విజ‌య్ మ‌రోసారి ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మిష‌న్ చాప్ట‌ర్ వ‌న్` లో మ‌రోసారి ఛాన్స్ ఇవ్వ‌డంతో ఐదేళ్ల త‌ర్వాత అమీ మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకుంది. కెరీర్ ఆరంభంలో తొలుత హీరోయిన్ గా ప‌రిచ‌యం చేసింది విజ‌య్ కావ‌డం..మ‌ళ్లీ కంబ్యాక్ చేయించ‌డం వెనుక విజ‌య్ కీల‌క పాత్ర‌ధారి అయ్యాడు. ఆ ర‌కంగా అమీజాక్స‌న్ కెరీర్ లో విజ‌య్ గాడ్ ఫాద‌ర్ లాంటి వారు అన‌డంలో సందేహం లేదు. హీరోయిన్ గా అవ‌కాశం రావ‌డం పోటీ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఎంత ట‌ఫ్ గా ఉందో తెలిసిందే. కానీ అమీజాక్స‌న్ కి మ‌రోసారి ఛాన్స్ ఇచ్చి ఆదుకోవ‌డం విశేషం. ఆ సినిమా నేడే రిలీజ్ అయింది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా అమీజాక్స‌న్ కోయంబ‌త్తూర్ లో హాల్చ‌ల్ చేస్తోన్న ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో చిత్ర ద‌ర్శ‌కుడు..న‌టుడితో క‌లిసి ఫోజులిచ్చింది. కోయంబ‌త్తూర్ లోని ఆదియోగి యోగా సెంట‌ర్ ముందు అమ్మ‌డు త‌ళుక్కున మెరిసింది. డిజైన‌ర్ దుస్తుల్లో శివుడుకి న‌మ‌స్కారం చేస్తూ క‌నిపించింది. ఈ పిక్ ఎంతో ఆహ్లాదంగా ఉంది.

అమీ ప‌ద్ద‌తైన దుస్తుల్లో శివ న‌మ‌స్కారం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఆమె మ‌న‌సులో కొర్కెల‌న్నీ ఆ శివుడి ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది.ఇక నుంచి కంబ్యాక్ దేదీప్యామానంగా సాగిపోవాల‌ని శివ‌ని కోరుకున్న ట్లుంది. ఆమె చుట్టూ అంతా అయ్య‌ప్ప భ‌క్తులు క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. చాలా గ్యాప్ త‌ర్వాత అమీ ఫోటో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తుంది.