Begin typing your search above and press return to search.

ఎమీజాక్స‌న్ ఇంత‌కీ ఏమైపోయింది?

వీటిలో ఒక ఫోటోలో క్లాప్‌బోర్డ్‌పై 'ఇట్స్ ఎ వార్‌' అని రాసి ఉంది. అమీతో పాటు క్రాక్ లో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 3:38 AM GMT
ఎమీజాక్స‌న్ ఇంత‌కీ ఏమైపోయింది?
X

2.0 తర్వాత ఎమీ జాక్స‌న్ సంద‌డి సౌత్ లో బాగా త‌గ్గిపోయింది. ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టించిన ఈ బ్యూటీకి ద‌క్షిణాదిన మంచి గుర్తింపు ఉంది. కానీ మ‌ధ్య‌లోనే కెరీర్ కి బ్రేక్ ఇచ్చి విదేశీ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు షురూ చేపింది. ఇంగ్లండ్ కి చెందిన జార్జిప‌నాయ‌టౌతో ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఎమీజాక్స‌న్, ఆ త‌ర్వాత అత‌డి నుంచి బ్రేక‌ప్ అయింది. ప్ర‌స్తుతం మ‌రో కొత్త ప్రియుడితో స‌హ‌జీవ‌నంలో ఉంది.


ఇప్పుడు సినీకెరీర్ పైనా ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తోంది. అమీ జాక్సన్ తన త‌దుప‌రి యాక్షన్ థ్రిల్లర్ 'క్రాక్'ను శుక్రవారం ప్రకటించింది. ఇన్‌స్టాలో ఎమీ కొన్ని ఫోటోల స్ట్రింగ్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు చాలా ఆక‌ట్టుకున్నాయి. 23 ఫిబ్రవరి 2024న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో #CRAKK మొదటి డ్రాప్ కి అద్భుత స్పంద‌న‌లు వ‌చ్చాయి.

వీటిలో ఒక ఫోటోలో క్లాప్‌బోర్డ్‌పై 'ఇట్స్ ఎ వ్రాప్' అని రాసి ఉంది. అమీతో పాటు క్రాక్ లో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. క్రాక్ ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ ఆదిత్య దత్, ఆషిక్ బనాయా అప్నే (2005),టేబుల్ నంబర్ 21 (2013) వంటి చిత్రాలతో పాపుల‌ర‌య్యాడు.

క్రాక్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. ముంబైలోని మురికివాడల నుండి క్రేజీగా ఉండే భూగర్భ క్రీడల ప్రపంచానికి ఒక వ్యక్తి ప్రయాణం. కమాండో 3 తర్వాత డైనమిక్ ద్వయం విద్యుత్ జ‌మ్వాల్- దర్శకుడు ఆదిత్య దత్‌ల అద్భుత క‌ల‌యిక ఇది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో యాక్షన్ హీరో ఫిల్మ్స్ & PZ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. విద్యుత్ జమ్‌వాల్, పరాగ్ సంఘ్వి , యాక్షన్ హీరో ఫిల్మ్స్ & టీమ్స్ నిర్మించారు. ఆది శర్మ - ఆదిత్య చౌక్సే ఈ చిత్రానికి సహ-నిర్మాతలు.