Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ సిసిలియ‌న్ మ‌ర్ఫీలా క‌నిపిస్తోంది

ఇక సోష‌ల్ మీడియాల్లో ఎమీజాక్స‌న్ ఫోటోలు వీడియోలు విరివిగా వైర‌ల్ అవుతున్నాయి. ఎమీ ఇంత‌కుముందు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అప్ప‌ట్లో ఓపెన్ హైమ‌ర్ న‌టుడు సిసిలియ‌న్ మ‌ర్ఫీని పోలి ఉంద‌ని కామెంట్లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   22 Feb 2024 8:30 AM GMT
మ‌ళ్లీ సిసిలియ‌న్ మ‌ర్ఫీలా క‌నిపిస్తోంది
X

బ్రిటీష్ నటి, మోడల్ ఎమీ జాక్సన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భార‌త‌దేశంలో ఈ అమ్మ‌డు పెద్ద స్టార్. ర‌జ‌నీకాంత్ 2.0, విక్ర‌మ్ ఐ, చ‌ర‌ణ్ ఎవ‌డు స‌హా ఎన్నో భారీ చిత్రాల్లో న‌టించింది ఎమీ. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే అనూహ్యంగా లండ‌న్ కి వెళ్లిపోయి త‌న ప్రియుడు బిలియ‌నీర్ జార్జి ప‌నాయ‌టౌతో కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం సాగించింది. ఈ బంధంలో ఎమీకి ఒక బిడ్డ కూడా జ‌న్మించాడు. కానీ ఆ బంధం బ్రేక‌ప్ అయ్యాక న‌టుడు కం మోడ‌ల్ ఎడ్ వెస్ట్ విక్ తో స్నేహం చేసింది. ఈ జంట త్వ‌ర‌లో పెళ్లితో ఒక‌టి కానున్నారు.

తన కాబోయే భర్త ఎడ్ వెస్ట్‌విక్‌తో ఎమీ ప్రతిష్టాత్మకమైన బాఫ్టా అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్ పై సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట వేదిక‌పై గ్లామర్ ఆకర్షణను వెదజల్లింది. మీడియా స‌హా అభిమానుల దృష్టిని ఎమీజాక్స‌న్ ఆకర్షించింది.

ఎమీ-ఎడ్ జంట రెండు సంవత్సరాల క్రితం డేటింగ్ ప్రారంభించారు. కొన్ని నెలలుగా వారి సాన్నిహిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో ఈ జంట సందడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది. మ‌రోవైపు ఎమీజాక్సన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

విద్యుత్ జ‌మ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫ‌తేహితో క‌లిసి ఈ భామ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం క్రాక్ ఈ నెలలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఎమీ జాక్స‌న్ అండ్ టీమ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. క్రాక్ తో హిట్టు కొట్టి ఎమీ తిరిగి ఇండియ‌న్ స్క్రీన్ పై వ‌రుస అవ‌కాశాలు అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది.

ఇక సోష‌ల్ మీడియాల్లో ఎమీజాక్స‌న్ ఫోటోలు వీడియోలు విరివిగా వైర‌ల్ అవుతున్నాయి. ఎమీ ఇంత‌కుముందు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అప్ప‌ట్లో ఓపెన్ హైమ‌ర్ న‌టుడు సిసిలియ‌న్ మ‌ర్ఫీని పోలి ఉంద‌ని కామెంట్లు వినిపించాయి. ఎమీజాక్స‌న్ ఫోటోను, మ‌ర్ఫీ ఫోటోను ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి పోలిక చెప్ప‌డంతో అది కాస్తా వేడెక్కించింది. ఇప్పుడు మ‌రోసారి ఎమీజాక్స‌న్ త‌న ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా, మళ్లీ సిసిలియ‌న్ మ‌ర్ఫీ ముఖాకృతిని పోలి ఉంద‌ని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా షేర్ అవుతోంది.