Begin typing your search above and press return to search.

అమీ అందాల సునామి

ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు అందాల భామల గ్లామర్ షోకి ఓ మంచి వేదిక అయ్యింది. సోషల్ మీడియా యుగంలో ఇన్ స్టా ను బ్యూటీస్ తమని తాము షోకేస్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:05 AM GMT
అమీ అందాల సునామి
X

ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు అందాల భామల గ్లామర్ షోకి ఓ మంచి వేదిక అయ్యింది. సోషల్ మీడియా యుగంలో ఇన్ స్టా ను బ్యూటీస్ తమని తాము షోకేస్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత నేత్రానందం అందిస్తున్నారు. అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


బ్రిటిష్ మోడల్ అయిన ఈ బ్యూటీ 2010లో మదరాసి పట్టణం సినిమాతో హీరోయిన్ గా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేసింది. మెజారిటీగా తమిళ్, హిందీ భాషలలో ఆమె మూవీస్ చేసింది. తెలుగులో ఎవడు సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కనిపించింది. ఆమె చివరిగా 2018లో రోబో 2.ఓ సినిమాలో రజినీకాంత్ కి జోడీగా నటించింది.


డిజిటల్ ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్ లో సూపర్ గర్ల్ వెబ్ సిరీస్ లో కూడా అమీ జాక్సన్ నటించింది. ఇదిలా ఉంటే ఓ హిందీ సినిమాకి కమిట్ అయ్యింది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాలు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.


హాట్ హాట్ ఫోటోలతో అందరిని అలరిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కర్ట్ తో సోఫాలో కూర్చొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. సింపుల్ గా ఉన్న ఈ ఫోజులో అమీ జాక్సన్ అందాల షో అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది.


కరెక్ట్ గా ఫోకస్ చేస్తే హాలీవుడ్ లో యాక్షన్ క్వీన్ గా మారిపోయే ఫీచర్స్ అమ్మడి దగ్గర ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యూకేలో సెటిల్ అయ్యింది. అక్కడ ఉంటూ హాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ సినిమాలపై పూర్తిగా ఫోకస్ తగ్గించేయడంతో మన దర్శక, నిర్మాతలు కూడా దృష్టి పెట్టడం లేదు.