Begin typing your search above and press return to search.

యానిమల్ సాంగ్​.. వంగా మార్క్​ రొమాన్స్​తో వినసొంపుగా

అమ్మాయి అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇంట్లో వాళ్లు పెళ్లి ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చేసి రణ్​బీర్​ - రష్మిక పెళ్లి చేసుకున్న జర్నీని ఈ సాంగ్​లో చూపించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 7:30 AM GMT
యానిమల్ సాంగ్​.. వంగా మార్క్​ రొమాన్స్​తో వినసొంపుగా
X

ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా తెరకెక్కిన యానిమల్‌పై మూవీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్​మెంట్​ అంతా ఇంతా కాదు. బార్డర్‌లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్‌ రెడ్డి లాంటి కల్ట్‌ క్లాసిక్​ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన సందీప్‌ రెడ్డి.. ఈ చిత్రంతో విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.

అమ్మాయి అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇంట్లో వాళ్లు పెళ్లి ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చేసి రణ్​బీర్​ - రష్మిక పెళ్లి చేసుకున్న జర్నీని ఈ సాంగ్​లో చూపించారు. రొమాంటిక్ లవ్ కిస్​తో ప్రారంభమైన ఈ సాంగ్​ ఆద్యంతం ఎంతో మెలోడియస్​గా రొమాంటిక్​గా సాగింది. విజువల్స్​ కూడా రిచ్​గా ఉన్నాయి. ప్రైవేట్‌ జెట్‌లో ఇద్దరు జర్నీ చేస్తూ రొమాన్స్ చేసుకున్నట్లు చూపించారు.

రష్మిక - రణ్​బీర్ లుక్​ కూడా ఎంతో కూల్​గా ఉంది. ఇద్దరు మద్య రొమాన్స్​ కెమిస్ట్రీ చాలా బాగుంది. సాంగ్​లో సందీప్ వంగా మార్క్​ బోల్డ్ అండ్ రొమాన్స్​ కంటెంట్​ స్పష్టంగా కనపించింది. ఇకపోతే ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ స్వరాలు సమకూర్చారు. రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మొత్తంగా సాంగ్​ శ్రోతలను ఆకట్టుకునేలా వినసొంపుగా సాగింది.

కాగా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రమ్​బీర్​కు నాన్నగా కనిపించనున్నారు. బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇకపోతే ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత డిసెంబర్‌ 1కు పోస్ట్‌ పోన్‌ చేశారు.

ఇప్పటికే రిలీజైన టీజర్‌ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా టీజర్‌లో సందీప్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. సినిమా నుంచి వస్తన్న బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంతో ఎలాగైనా రష్మిక.. బాలీవుడ్​ తొలి హిట్​ను అందుకుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.