Begin typing your search above and press return to search.

వీడియో : రమణ గాడి రిపబ్లిక్ డే గిఫ్ట్‌ అదుర్స్‌

తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు అమ్మ సాంగ్ ను తీసుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 7:58 AM GMT
వీడియో : రమణ గాడి రిపబ్లిక్ డే గిఫ్ట్‌ అదుర్స్‌
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూలతో సంబంధం లేకుండా గుంటూరు కారం సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

గుంటూరు కారం సినిమా ఫలితం పట్ల యూనిట్‌ సభ్యులు సంతృప్తికరంగా ఉన్నారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు అమ్మ సాంగ్ ను తీసుకు వచ్చారు. సినిమాలోని అమ్మ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ పాటను విడుదల చేయాలనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

మహేష్ బాబు, రమ్యకృష్ణ మధ్య ఉండే తల్లి కొడుకు అనుబంధం ను చూపిస్తూ పాటను చూపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు థమన్ సంగీతాన్ని అందించాడు. విశాల్‌ మిశ్ర ఈ పాటను ఆలపించాడు. ఆలోచింపజేసే లిరిక్స్ తో పాటు వీనుల వింధైన సంగీతం తో పాట ఆకట్టుకుంది.

రిపబ్లిక్ డే కి చక్కని గిఫ్ట్‌ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ పాటకు సంబంధించిన స్కీన్ షాట్స్ మరియు లిరిక్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు.