Begin typing your search above and press return to search.

కోడ‌ల్ని మామ అన్ ఫాలో చేయ‌డం ఏంటో?

ఐశ్వ‌ర్యారాయ్-అభిషేక్ బ‌చ్చ‌న్ విడిపోతున్నార‌న్న వార్త ఒక్క‌సారిగా నెట్టింట ఎంత‌టి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:30 AM GMT
కోడ‌ల్ని మామ అన్ ఫాలో చేయ‌డం ఏంటో?
X

ఐశ్వ‌ర్యారాయ్-అభిషేక్ బ‌చ్చ‌న్ విడిపోతున్నార‌న్న వార్త ఒక్క‌సారిగా నెట్టింట ఎంత‌టి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. దీంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. వాళ్లిద్ద‌రు విడిపోవ‌డం ఏంటి? అని విస్తుపోయారు. అటుపై అమితాబ‌చ్చ‌న్ చేసిన కొన్ని పోస్టులు... తాజాగా ఐశ్వ‌ర్యారాయ్ ని మామ ఇన్ స్టాలో అన్ ఫాలో చేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో అస‌లేం? జ‌రుగుతుందో అర్దం కాని స‌న్నివేశం ఎదురైంది.

ఇవ‌న్నీ ఒకేసారి తెర‌పైకి రావ‌డంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. బిగ్ బీ ఇన్ స్టాలో ఫాలో అయ్యేది కేవ‌లం 74 మందినే. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. వాళ్ల‌తో పాటు కోడ‌లు కూడా ఉన్నారు. ఇప్పుడు కోడ‌లు వాళ్ల ప‌క్క‌న లేక‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల గంద‌రోగ‌ళం నెల‌కొంది. అయితే అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన `ది ఆర్చీస్` ఇటీవలే విడుదలైంది.

ముంబైలో ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య.. అమితాబ్..ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు. దీంతో అంతా ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకున్నారు. సోష‌ల్ మీడియాలో ఆ కుంటుంబ గురించి వ‌చ్చిన వార్త‌ల‌న్ని అవాస్త‌వాల‌ని ఓ నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. మ‌రి అమితా బ్..కోడ‌ల్ని అన్ ఫాలో చేయ‌డం వెనుక క‌థ ఏంటి? అని మ‌రో వ‌ర్గం సీరియ‌స్ గానే ఆలోచ‌న చేసింది. దీని వెనుక ర‌క‌ర‌కాల కార‌ణాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఆయ‌న అన్ ఫాలో చేయ‌కుండానే అలా జ‌రుగుతుందా? అమితాబ్ కి స్మార్ట్ ఫోన్ వినియోగించ‌డం తెలియ‌కా? ఇలా జ‌రిగిందంటారా? ఇవి నమ్మే నిజానాలే? అంటూ మ‌రికొంత మంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మెజార్టీ వ‌ర్గం మాత్రం అమితాబ్ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్ కార‌ణంగా ఎవ‌ర్నీ ఫాలో అవుతుంది స్ప‌ష్టంగా చెప్ప‌డం వీలు ప‌డ‌టం లేద‌ని..అంత‌కు మించి ర‌హ‌స్యాలేవి ఇందులో లేవ‌ని అభిమానులు భావిస్తున్నారు.