Begin typing your search above and press return to search.

డెన్‌లో RGVని అమితాబ్ క‌ల‌వ‌డం వెన‌క సీక్రెట్

తాజా ఫోటోగ్రాఫ్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ గా మార‌డ‌మేగాక దీనిపై నెటిజ‌నుల్లో డిబేట్ మొద‌లైంది. ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాల నుంచి స‌ర్కార్, స‌ర్కార్ రాజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లు వచ్చాయి.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:51 PM GMT
డెన్‌లో RGVని అమితాబ్ క‌ల‌వ‌డం వెన‌క సీక్రెట్
X

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కలిశారు. ఆ ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లో సంద‌డి చేయ‌డం.. అది కూడా హైద‌రాబాద్ లో క‌లుసుకుని మంత‌నాలు సాగించ‌డంతో ఇది ర‌క‌ర‌కాల ఊహాగానాలకు దారి తీస్తోంది. ఇది మరో 'సర్కార్' కోసం క‌ల‌యికేనా? అంటూ ఫ్యాన్స్ లో ఆస‌క్తి మొద‌లైంది.

తాజా ఫోటోగ్రాఫ్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ గా మార‌డ‌మేగాక దీనిపై నెటిజ‌నుల్లో డిబేట్ మొద‌లైంది. ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాల నుంచి స‌ర్కార్, స‌ర్కార్ రాజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లు వచ్చాయి. 'స‌ర్కార్ 3' ఆశించ‌నంత‌గా ఆడ‌క‌పోయినా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం చెక్కు చెద‌ర‌లేదు. ఇప్ప‌టికీ ఆర్జీవీ- అమితాబ్ మ‌ధ్య స్నేహం కొన‌సాగుతూనే ఉంది.

అయితే ఇప్పుడు ఆక‌స్మికంగా అమితాబ్ నేరుగా ఆర్జీవీని క‌ల‌వ‌డం వెన‌క ఏదైనా మ‌ర్మం ఉందా? అంటే దీనికి స‌రైన‌ క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం రిలీజ్ కి రాబోతున్న ఆర్జీవీ వ్యూహం చిత్రం ప్ర‌మోష‌న్స్ కి అమితాబ్ సాయం చేస్తున్నార‌న్న ఊహాగానాలున్నాయి. అయినా ప్రభాస్ తో క‌ల్కి మూవీ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న అమితాబ్ త‌న స్నేహితుడు ఆర్జీవీ కోసం ఇలా వ‌చ్చారు అంతే! అని కూడా కొంద‌రు చెబుతున్నారు. ఆ ఇద్ద‌రూ ఉన్న ఫోటో క‌నిపించ‌గానే.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గొప్ప లెజెండ్స్ క‌లిసి సినిమా చేస్తారా? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శ్నించారు.

రామ్‌గోపాల్ వర్మ పొలిటికల్ థ్రిల్లర్ 'వ్యూహం' మార్చి 2న విడుద‌ల కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేప‌థ్యంలో వ‌ర్మ సెటైరిక‌ల్ మూవీ ఇది. ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌లైంది.