Begin typing your search above and press return to search.

ఇద్దరు లెజెండ్స్.. మెస్మరైజింగ్ పిక్

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక బాలీవుడ్ చరిత్రలో గ్రేటెస్ట్ ఎవర్ హీరోలు, నటుల్లో ఒకడు అమితాబ్ బచ్చన్.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:31 AM GMT
ఇద్దరు లెజెండ్స్.. మెస్మరైజింగ్ పిక్
X

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక బాలీవుడ్ చరిత్రలో గ్రేటెస్ట్ ఎవర్ హీరోలు, నటుల్లో ఒకడు అమితాబ్ బచ్చన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలో ‘హమ్’ సహా కొన్ని చిత్రాలు వచ్చాయి. చివరగా 32 ఏళ్ల కిందట ‘హమ్’ సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ లెజెండ్స్ ఇద్దరూ. ఆ తర్వాత కొన్నేళ్లకే అమితాబ్ హీరో వేషాలు పక్కన పెట్టేసి క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోవడంతో తన సినిమాల్లో రజినీకి చోటిచ్చే అవకాశం రాలేదు. మరోవైపు రజినీ కూడా అమితాబ్‌కు తన సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇవ్వలేదు. ఐతే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించబోతున్న విషయం ఇప్పటికే వెల్లడైంది. ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ రాజా కొత్త చిత్రంలో రజినీ హీరోగా నటిస్తుంటే అమితాబ్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు ఇంతకుమందే ప్రకటించారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అమితాబ్‌కు ఇబ్బంది కలగకుండా షూటింగ్ ముంబయిలోనే పెట్టుకుంది చిత్ర బృందం. అక్కడే అమితాబ్ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాట్ గ్యాప్‌లో రజినీ, అమితాబ్ కలిసి దిగిన ఒక అందమైన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. ఇద్దరు లెజెండ్స్‌ను ఇలా ఒకే ఫొటోలో చూడటం వాళ్లిద్దరి అభిమానులకూ అమితానందాన్నిస్తోంది. అమితాబ్ వయసు 80 ఏళ్లు దాటిపోగా.. రజినీ 73వ పడికి చేరువ అవుతున్నాడు. ఈ వయసులోనూ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తుండటం విశేషమే. ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ అత్యంత ఆకర్షణీయమైన లుక్స్‌లో కనిపిస్తున్నది ఈ కొత్త చిత్రంలోనే అనిపించేలా ఉంది ఈ ఫొటో. ఇద్దరి అనుబంధాన్ని చాటేలా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.