Begin typing your search above and press return to search.

మంత్ర తంత్రాల‌తో మెగాస్టార్ ఏం చేయ‌ద‌లిచారు?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వ‌య‌సులో చేస్తున్న సాహ‌సాలు అన్నీ ఇన్నీ కావు. వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని అత‌డు నిరూపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 10:11 AM IST
మంత్ర తంత్రాల‌తో మెగాస్టార్ ఏం చేయ‌ద‌లిచారు?
X

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వ‌య‌సులో చేస్తున్న సాహ‌సాలు అన్నీ ఇన్నీ కావు. వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని అత‌డు నిరూపిస్తున్నాడు. ఈ వ‌య‌సులో ఆయ‌న తీవ్రంగా శ్ర‌మించ‌డం ద్వారా ఏడాదికి 50కోట్లు సుమారు సంపాదిస్తున్నాడు. ఇది వేరొక న‌టుడికి సాధ్యం కాదు. పెద్ద తెర బుల్లితెర రెండిటినీ ఏల్తున్న పెహ‌న్ షాగా నీరాజ‌నాలు అందుకుంటున్నారు. ఏజె లెస్ స్టార్ బిగ్ బి ఎన‌ర్జీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అత‌డు భార‌తావ‌ని శాంతి కాముకుడిగాను త‌న సేవ‌లు అందిస్తున్నారు. భార‌తీయ‌త‌, ఆధ్యాత్మిక‌త‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నారు. త‌న తండ్రి హ‌రివంశ్ రాయ్ బచ్చ‌న్ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని ప‌లు ర‌చ‌న‌ల‌ను బ్లాగులు, సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌ల్ని ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మ‌కిత‌పై ఆయ‌న షేర్ చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. ఇటీవలి వీడియోలో ర‌క‌ర‌కాల‌ శ్లోకాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మికత బలమైన సందేశాన్ని ప్రోత్సహించడానికి బాలీవుడ్ మెగాస్టార్ ప్రయత్నించాడు.

అమితాబ్ తాజాగా ఒక సుదీర్ఘ‌మైన వీడియోను షేర్ చేసాడు. ఇందులో ప‌లు స్త్రోత్రాల ప‌ట‌నం ఆక‌ర్షించింది. మహాలక్ష్మి, సరస్వతి, గౌరి, రాధే కృష్ణ వంటి దేవతల వివిధ మంత్రాలను జపించ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. హిందూ శ్లోకాలను పఠించడం ద్వారా భార‌తీయ‌త‌ను ప్ర‌పంచానికి విస్త‌రించే ప్ర‌య‌త్నం అమిత్ జీ చేసారు.

``.. హృదయం కోరుకుంటుంది.. మనసు ప్రతిధ్వనిస్తుంది.. ఆత్మ స్వరం ఇస్తుంది.. - అమితాబ్ బచ్చన్ రాసిన శ్లోక్ పారాయణం`` అనే శీర్షికతో ఇది వైర‌ల్ అవుతోంది. ఆధ్యాత్మికతతో అమితాబ్ అనుబంధానికి సూచిక ఇది. అత‌డు తన అభిమానుల హృదయాలలో ఆధ్యాత్మిక భావనను మేల్కొల్పడానికి, ఆధునిక కాలంలో సాంప్రదాయ విలువలను ప్రోత్సహించడానికి చేసిన చిన్న‌పాటి ప్రయత్నంగా దీనిని చూడాలి. ఈ వీడియో అభిమానుల దృష్టిని వేగంగా ఆకర్షించింది. ప‌లువురు తార‌లు ఈ వీడియోకి స్పందిస్తూ హార్ట్ క్లాప్స్, ఈమోజీల‌ను షేర్ చేసారు. ఆధ్యాత్మిక‌త‌తో ప‌ర‌వ‌శిస్తూ అమితాబ్ రాసిన ఈ లేఖ‌పై చాలా ప్ర‌శంసా పూర్వ‌క వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేసాయి.

మెరుగైన ప్రపంచం కోసం బిగ్ బి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఆయన ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆయన యునిసెఫ్ ఇండియాతో చేతులు కలిపి ప్ర‌జా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్‌కి వస్తే.. 82 ఏళ్ల అనుభ‌వ‌జ్ఞుడు అలుప‌న్న‌దే లేకుండా ఇప్ప‌టికీ నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఆయన చివరిసారిగా 2024లో రజనీకాంత్ తో కలిసి `వెట్టయన్`లో న‌టించాడు. ప్ర‌భాస్ తో క‌లిసి క‌ల్కి 2898 ఏడి లోను న‌టించాడు. ప‌లువురు ద‌క్షిణాది స్టార్ హీరోల సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు.