ఐశ్వర్యను అందరిముందు పొగడక పోవడానికి కారణమదే!
అమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లైఫ్ లో ఆయన్ను ఒక్కసారిగా కలిసినా చాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు.
By: Tupaki Desk | 25 Jun 2025 12:00 AM ISTఅమితాబ్ బచ్చన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లైఫ్ లో ఆయన్ను ఒక్కసారిగా కలిసినా చాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటారు. ఆయనకు ఏదైనా సినిమా నచ్చితే వారిని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు అమితాబ్.
ఇక తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను అయితే సందర్భం రావడం ఆలస్యం తెగ పొగిడేస్తుంటారు. ఎప్పటికప్పుడు అభిషేక్ సినిమాలపై, అందులో అభిషేక్ యాక్టింగ్ పై పోస్టులు చేసే అమితాబ్ పై ఈ విషయంలో విమర్శలు కూడా వచ్చాయి. కొడుకు అభిషేక్ బచ్చన్ ను పొగిడినట్టు కోడలు ఐశ్వర్య రాయ్, భార్య జయా బచ్చన్ ను ఎందుకు పొగడరని అమితాబ్ ను విమర్శిస్తూ ఉంటారు.
తాజాగా ఈ విషయాన్ని ఓ అభిమాని అమితాబ్ ను అడగ్గా దానికి ఆయన స్పందించారు. అభిషేక్ ను తానెప్పుడూ ప్రశంసిస్తూ ఉండే మాట నిజమేనని, అభిషేక్ కు అందరిపైనా ప్రేమ, గౌరవం ఎక్కువని ఆయన తెలిపారు. అభిషేక్ ను పొగిడినట్టే తన భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ ను కూడా ప్రశంసిస్తానని, కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటానని, అది తనకు మహిళలపై ఉన్న గౌరవమని అమితాబ్ తెలిపారు.
అమితాబ్ ను ఇంటి వద్ద కలవడానికి వచ్చే ఫ్యాన్స్ ను కూడా ఆయన అవమానించడానికి ప్రయత్నించారనే విమర్శపై కూడా ఆయనకు ప్రశ్న ఎదురైంది. వారంతా నిరుద్యోగులని, అందుకే జల్సా(ముంబై లోని అమితాబ్ ఇంటి పేరు) వద్దకు వచ్చి ఎదురుచూస్తుంటారని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా, దానికి అమితాబ్ స్పందించారు. జల్సా వద్దకు వచ్చే వారు నిరుద్యోగులైతే మీరు వారికి జాబ్ ఇవ్వండి, అయినా నా ప్రేమలో వారెప్పుడూ ఉన్నతోదోగ్యులేనని ఆయన బదులిచ్చారు.
