Begin typing your search above and press return to search.

మందు ముక్క రోజుకు 200 సిగ‌రెట్లు.. లెజెండ‌రీ న‌టుడి అల‌వాట్లు!

ఈ బాలీవుడ్ లెజెండ్ మ‌ద్యం లేనిదే జీవించ‌లేదు. రోజుకు 200 సిగ‌రెట్లు కాలుస్తాడు. మాంసం లేనిదే ముద్ద దిగ‌దు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 9:56 AM IST
మందు ముక్క రోజుకు 200 సిగ‌రెట్లు.. లెజెండ‌రీ న‌టుడి అల‌వాట్లు!
X

ఈ బాలీవుడ్ లెజెండ్ మ‌ద్యం లేనిదే జీవించ‌లేదు. రోజుకు 200 సిగ‌రెట్లు కాలుస్తాడు. మాంసం లేనిదే ముద్ద దిగ‌దు. అయితే అదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు అత‌డు శాఖాహారి. విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌యాణాల్లో వెజిట‌బుల్ ఆహారం దొర‌క్క‌పోతేనే నాన్ వెజ్ తినాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. ఒక‌ప్ప‌టి త‌న అల‌వాట్ల గురించి గుర్తు చేసుకున్న అమితాబ్ బ‌చ్చ‌న్ పాత ఇంట‌ర్వ్యూ ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది. ఈ ఇంట‌ర్వ్యూలో లెజెండ‌రీ న‌టుడు ఆశ్చ‌ర్యం క‌లిగించే వ్య‌క్తిగ‌త అల‌వాట్ల గురించి ఓపెన‌య్యారు.

అస‌లు ఈ అల‌వాట్లు ఎవ‌రు మాన్పించారు? అంటే.. జీవించ‌డం కోసం ప‌రిస్థితులు త‌న‌ను అలా మార్చాయ‌ని మాత్ర‌మే అమితాబ్ చెప్పారు. త‌న‌కు తానుగా మానేయ‌లేదు.. ప‌రిస్థితులు మాన్పించాయ‌ని అన్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ నేడు తన క్రమశిక్షణ, నిరాడంబరమైన జీవనశైలికి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు చాలా భిన్నమైన జీవితాన్ని గడిపారు. 1980లో ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన పాత‌ అలవాట్ల గురించి చెబుతూ.. బాగా సిగ‌రెట్లు కాల్చ‌డం, క్రమం తప్పకుండా మద్యం సేవించడం, మాంసం తినడం వంటివి ఉన్నాయ‌ని అన్నారు.

ఇప్పుడు మందు తాగ‌ను. మాంసం తిన‌ను. సిగ‌రెట్లు కాల్చ‌ను... ఇది మతపరమైన సమస్య కాదు.. కానీ అభిరుచికి సంబంధించిన విషయం! అని అన్నారు. నేను మాంసం తినేవాడిని, మద్యం తాగేవాడిని, పొగ త్రాగేవాడిని, కానీ నేను అవన్నీ వదులుకున్నాను! అని అన్నారు. మ‌తం కోసం ఈ ప‌ని చేయ‌లేదు. ఆచరణాత్మక సవాళ్ల నుండి ఈ మార్పు వచ్చింది.. అని తెలిపారు. త‌న త‌ల్లి తేజీ, భార్య జ‌యాబ‌చ్చ‌న్ మాంసాహారాన్ని ఆస్వాధిస్తార‌ని, తిండి విష‌య‌మై గొడ‌వ‌లేవీ ఉండ‌వ‌ని అన్నారు. అయితే త‌న‌ తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ హరివంశ్ రాయ్ బచ్చన్ జీవితాంతం శాఖాహారిగా ఉన్నారు.

క‌ల‌క‌త్తాలో ఉన్న‌ప్పుడు తాను రోజుకు 200 సిగ‌రెట్లు కాల్చాన‌ని అమితాబ్ అంగీక‌రించ‌డం షాకిచ్చింది. బొంబాయికి వ‌చ్చాక మానేశాను. నేను కూడా అతిగా తాగాను.. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నాకు తాగుడు అవసరం లేదని గ్రహించానని తెలిపారు. విదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు శాఖాహార ఆహారాన్ని కనుగొనడం చాలా సవాలుగా ఉంటేనే మాంసాహారాన్ని తినాల్సి వ‌స్తోంది. ఇక‌పై అల‌వాట్లు న‌న్ను ప్ర‌భావితం చేయ‌వు అని అమితాబ్ అన్నారు. తాను కోపాన్ని త‌గ్గించుకున్నాన‌ని అన్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే త‌దుప‌రి బిగ్ బి క‌ల్కి సీక్వెల్ లో న‌టించ‌నున్నారు.