బాలీవుడ్ స్టార్ హీరో సడెన్ పోస్టుకు కారణమేంటి?
నటుడిగా ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి భారీ అభిమానులను సంపాదించుకున్నారాయన.
By: Tupaki Desk | 19 July 2025 2:00 PM ISTనటుడిగా ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి భారీ అభిమానులను సంపాదించుకున్నారాయన. ఆయన్ని ఒక్కసారైనా చూడాలని కొంతమంది ఆశపడితే, లైఫ్ లో ఒక్కసారైనా అతనితో మాట్లాడాలని, ఫోటో దిగాలని మరికొందరు అభిమానులు ఆశపడుతుంటారు.
సినీ రంగానికి చెందిన వారైతే ఆయనతో కలిసి ఒక్కసారైనా వర్క్ చేయాలనుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప నటుడు అమితాబ్. 82 ఏళ్ల వయసులో కూడా ఆయన అభిమానుల్ని అలరిస్తూ సినిమాలు, షోలు చేస్తూ వస్తున్నారు. తనను ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ అంటే అమితాబ్ కు కూడా ఎంతో ప్రేమ, గౌరవం. అందుకే ఎప్పుడూ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు బిగ్ బీ.
భాషతో సంబంధం లేకుండా అమితాబ్ కు ఎంతో మంది అభిమానులుండగా వారందరికీ జాగ్రత్తలు చెప్తూ అమితాబ్ ఎక్స్‌లో శుక్రవారం మూడు పోస్టులు చేశారు. అమితాబ్ సడెన్ గా చేసిన పోస్టే అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే ఆ పోస్టులను ఆయన తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో చేసి ఫ్యాన్స్ ను మరింత ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రార్థనలు: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి, వ్యాధి లేకుండా ఉండండి, సుభిక్షంగా ఉండండి అంటూ అమితాబ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
అయితే అమితాబ్ అక్కడితో ఆగలేదు. తన ట్వీట్ చివరలో ఓం తో పాటూ ప్రార్థించే చేతులు, టెంపుల్ ఎమోజీని కూడా యాడ్ చేస్తూ తన ఫ్యాన్స్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే అమితాబ్ సడెన్ గా ఈ ట్వీట్ ఎందుకు చేశారనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కారణం ఏదైనా అమితాబ్ చేసిన పోస్ట్ ఆయనకు అభిమానులపై ఎంత ప్రేముందో అని విషయాన్ని తెలియచేస్తుంది. తమ అభిమాన హీరో చేసిన పోస్ట్ కు ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
