మెగాస్టార్‌కి ముంబైలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా?
అమితాబ్ బచ్చన్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబై నడిబొడ్డున 5 రాజభవనాలు అతడి కుటుంబానికి ఉన్నాయి.
By: Tupaki Desk | 29 April 2025 7:00 AM ISTబాలీవుడ్ మెగాస్టార్, షాహెన్‌షా అమితాబ్ బచ్చన్ బిలియనీర్ గా ఎదగడానికి ముందు ఒక బెంచీ మీద నిదురించిన రోజులు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? కానీ అలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. అతడి ఆస్తులన్నీ అప్పుల కారణంగా హరించుకుపోయాయి. ఉపాధిని కోల్పోయాడు. కానీ అతడు పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసాడు. ఇప్పుడు అతడి కుటుంబ ఆస్తుల విలువ 1600 కోట్లు. అతడికి అందని లగ్జరీ లైఫ్ లేదు. ఐదు దశాబ్ధాల కెరీర్ లో నటుడిగా తన సంపాదనను సొంత అపార్ట్ మెంట్లు, రియల్ వెంచర్లు సహా పలు వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టాడు. ఇప్పుడు అతడికి ముంబైలోనే ఐదు సొంత ఇండ్లు ఉన్నాయి. ప్యారిస్ లో ఒక ఇంటిని సొంతం చేసుకున్నాడు.
అమితాబ్ బచ్చన్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబై నడిబొడ్డున 5 రాజభవనాలు అతడి కుటుంబానికి ఉన్నాయి. రూ. 112 కోట్లు జల్సా.. రూ. 3 కోట్ల పారిస్ ఇల్లు సహా ఇంకో మూడు స్వగృహాలు అతడికి ఉన్నాయి. రూ. 112 కోట్ల విలువైన జల్సాలో బచ్చన్ కుటుంబంలోని మూడు తరాలు నివాసం ఉంటున్నారు. అప్పటికే ముంబైలో అతడి మొట్టమొదటి బంగ్లా 'ప్రతీక్ష' కూడా ఉంది. ఆ ఇంట్లో ఇప్పటికీ అతడి తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ తేజీ బచ్చన్ గదులు ఉన్నాయి. అభిషేక్ - ఐశ్వర్య వివాహం ఇక్కడే జరిగింది. అలాగే బచ్చన్ కి జనక్ అనే మరో ఇల్లు ఉంది. ఇది బచ్చన్ కుటుంబానికి ఆఫీస్ కూడా.
2004లో అమితాబ్ కుటుంబం కొనుగోలు చేసిన మరో ఆస్తి విలువ దాదాపు రూ. 50 కోట్లు. 'వత్స' అనే మరో ఆస్తి కూడా ఉంది. దీనిని సిటీబ్యాంక్ ఇండియాకు లీజుకు ఇచ్చారు. అలాగే అలహాబాద్‌లోని క్లైవ్ రోడ్‌లోని వారి పూర్వీకుల ఇంటి యాజమాన్యాన్ని బచ్చన్ కుటుంబం నిలుపుకుంది. జల్సా వెనుక 8,000 చదరపు అడుగుల సహ-యాజమాన్యంలోని భవనం ఉంది. ఇది కుమారుడు అభిషేక్‌తో ఉమ్మడి ఆస్తి. జయా బచ్చన్ అతడికి పారిస్‌లో 3 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన ప్రేమకు అందమైన బహుమతి ఇది.
బచ్చన్ జీ గ్యారేజీలో ఖరీదైన కార్లకు కొదవేమీ లేదు. అతడికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీనిని ఫిలింమేకర్ విధు వినోద్ చోప్రా బహుమతిగా ఇచ్చారు. 6.75L V12 ఇంజిన్ - ఫైవ్-స్టార్ హోటల్ లాబీలా అద్భుత ఇంటీరియర్‌లతో బీస్ట్ కార్ ఇది. అలాగే బెంట్లీ కాంటినెంటల్ జిటి అమితాబ్ సొంతం. పోర్స్చే కేమన్ ఎస్, మెర్సిడెస్ SL500, లెక్సస్ LX470 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇవే కాదు.. అమితాబ్ హోదాకు తగ్గట్టే ఒక ప్రయివేట్ జెట్ కూడా ఉంది. అమితాబ్ రెగ్యులర్ గా ఈ జెట్ లో కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటారు.
