80 ప్లస్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ టీవీ హోస్ట్?
బుల్లితెరపై అత్యంత విజయవంతమైన క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్ పతి`. బుల్లితెరపై అత్యంత విజయవంతమైన హోస్ట్ - అమితాబ్ బచ్చన్.
By: Tupaki Desk | 17 July 2025 9:43 PM ISTబుల్లితెరపై అత్యంత విజయవంతమైన క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్ పతి`. బుల్లితెరపై అత్యంత విజయవంతమైన హోస్ట్ - అమితాబ్ బచ్చన్. ఈ రెండిటినీ కాదనేవారు ఎవరూ లేరు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ 82 వయసులో అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న ఏకైక హోస్ట్ గాను రికార్డులకెక్కారు. అతడు కేబీసీ కోసం ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల పారితోషికం అందుకుంటుండడం ఒక సంచలనం.
ఇప్పుడు సీజన్ 17 ప్రారంభం కానుందని, అమితాబ్ తిరిగి హోస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారని సోని ఎంటర్ టైన్ మెంట్ ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం KBC 17 సీజన్ 11 ఆగస్టు 2025న ప్రీమియర్ అవుతుంది. అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నారు. తాజాగా కేబీసీ 17 మొదటి ప్రోమోను మేకర్స్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ చిన్న క్లిప్ గేమ్ షో ప్రత్యేకతను ఆవిష్కరించింది. నటుడు సుంబుల్ తౌకీర్ ఖాన్ తో హోస్ట్ అమితాబ్ కూడా కనిపించారు. ఈ షోని సీఐడి 2 స్థానంలో రీప్లేస్ చేస్తారని కూడా తెలుస్తోంది.
KBC 25 సంవత్సరాల క్రితం జూలై 3న తొలి సీజన్ ఎపిసోడ్ ప్రీమియర్ అయింది. ఇది దేశీ టెలివిజన్ రంగంలో గేమ్ షోల ఫార్మాట్ ని విప్లవాత్మకంగా మార్చింది. బిగ్ బి ఐకానిక్ `నమస్తే` షోలో గొప్పగా పాపులారిటీ తెచ్చింది. హోస్టింగ్ లో అమితాబ్ ట్రేడ్‌మార్క్ శైలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలకు కనెక్టయింది. మొదటి సంవత్సరంలోనే భారతదేశంలోని ప్రతి మూలకు కేబీసీ చేరుకుంది. కొన్నేళ్లుగా కల్ట్ అభిమానుల మనసుల్ని స్థిరంగా గెలుచుకుంది.
బిగ్ బి సినీ కెరీర్ సంగతికి వస్తే.. అతడు తదుపరి `సెక్షన్ 84`లో నటిస్తున్నాడు. నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ తదితరులు ఇందులో నటించారు. బ్రహ్మాస్త్ర 2 , కల్కి 2898 ఏడీ సీక్వెల్ లలో అతడు నటిస్తారు.
