రామాయణ కోసం బిగ్ బీ.. దేనికంటే?
తాజా సమాచారం ప్రకారం భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా భాగమవుతున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 July 2025 11:42 AM ISTబాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా పాత్రల ఇంట్రోకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి అశేష స్పందన లభిస్తుంది. గ్లింప్స్ తర్వాత రామాయణ సినిమాకు హైప్ మరింత పెరిగింది. ఆ గ్లింప్స్ చూసి పలువురు సెలబ్రిటీలు రామాయణపై తమ ఒపీనియన్స్ ను వెల్లిబుచ్చుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా భాగమవుతున్నట్టు తెలుస్తోంది. మహాభారతం ఆధారంగా వచ్చిన కల్కి 2898ఏడీలో అశ్వత్థామ పాత్ర చేసి తన యాక్టింగ్ తో ప్రతీ ఒక్కరినీ అబ్బురపరిచిన బిగ్ బీ ఇప్పుడు ప్రిస్టీజియస్ రామాయణలోనూ భాగం కానుండటం విశేషంగా మారింది.
అయితే కల్కి సినిమాలో లాగా రామాయణలో అమితాబ్ ఎలాంటి ప్రత్యేక పాత్రనూ చేయడం లేదు. జటాయువు అనే పాత్రకు అమితాబ్ కేవలం వాయిస్ ఓవర్ ను మాత్రమే ఇవ్వనున్నారట. ఇది కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న వార్తలే తప్పించి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడుగా నటించనున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గా గ్లింప్స్ రిలీజైన నేపథ్యంలో ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌నే ఎందుకు సెలెక్ట్ చేశారనే విషయాన్ని ఆ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ముఖేష్ తెలిపారు. రాముడి పాత్ర చేసే ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని, రణ్‌బీర్ ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారని, అందుకే డైరెక్టర్ నితేష్ తివారీ రణ్‌బీర్ ను రాముడిగా సెలెక్ట్ చేశారని, సినిమా చూశాక రాముడిగా రణ్‌బీర్ సెలెక్షన్ కరెక్ట్ అని అందరికీ అనిపిస్తుందని ఆయన చెప్పారు. రెండు భాగాలుగా రానున్న రామాయణం రూ.1600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుండగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
