భార్యకు విడాకులు.. స్పందించిన హీరో
అయితే ఈ వార్తలు ఇక్కడితో ఆగలేదు. భర్త అభిషేక్‌తో కలిసి వేరు కుంపటి పెట్టిందని, సొంత ఇంటికి వెళదామని భర్త అభిషేక్‌ని పోరిందని ఐశ్వర్యారాయ్ పైనా చాలా మీడియాలు నిందలు వేసాయి.
By: Tupaki Desk | 6 July 2025 11:50 AM ISTచాలా కాలంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంపై మీడియాలు ఆశ్చర్యకర కథనాలను వెలువరిస్తున్నాయి. అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారనేది ఈ వార్తల సారాంశం. ఈ జంట 2007లో పెళ్లాడగా, 2011లో ఆరాధ్యబచ్చన్ జన్మించింది. అయితే జయాబచ్చన్ తో కోడలు ఐశ్వర్యారాయ్ కి సరిపడటం లేదని, ఇద్దరి మధ్యా విభేధాలున్నాయని చాలా కాలంగా ప్రచారం ఉంది. అలాగే అభిషేక్ బచ్చన్ సోదరి, అమితాబ్ కుమార్తె అయిన శ్వేతానందా బచ్చన్ కు, ఐశ్వర్యారాయ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని కూడా కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి.
అయితే ఈ వార్తలు ఇక్కడితో ఆగలేదు. భర్త అభిషేక్‌తో కలిసి వేరు కుంపటి పెట్టిందని, సొంత ఇంటికి వెళదామని భర్త అభిషేక్‌ని పోరిందని ఐశ్వర్యారాయ్ పైనా చాలా మీడియాలు నిందలు వేసాయి. అత్తమామలకు దూరంగా భర్తను లాక్కెళ్లేందుకు ప్రయత్నించిందని కూడా కథనాలొచ్చాయి.
ఇక ఇటీవలి కాలంలో అభిషేక్ - ఐశ్వర్యారాయ్ విడివిడిగా ఉంటున్నారని, కలిసి జీవించడం లేదని కూడా కొన్ని పుకార్లు ఆశ్చర్యపరిచాయి. ఐశ్వర్యారాయ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా ఒంటరిగా వెళుతోంది. తనతో పాటు ఆరాధ్య బచ్చన్ తప్ప అభిషేక్ కనిపించడని కూడా కొన్ని మీడియాలు లాజిక్ ని ఎత్తి చూపేందుకు ప్రయత్నించాయి. గత ఏడాది అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లిలో అమితాబ్ - అభిషేక్ కలిసి ఈవెంట్ కి హాజరైతే, ఐశ్వర్యారాయ్ మాత్రం విడిగా వచ్చిందని కూడా కొన్ని మీడియాలు ఎత్తి చూపాయి. అంతేకాదు.. ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు పార్టీ ఫోటోల్లో అభిషేక్ కనిపించలేదని, కేన్స్‌లో ఐశ్వర్య ప్రదర్శనకు అభి స్పందించలేదని కూడా రెడ్డిటర్లు కథనాలు అల్లారు. ఆ ఇద్దరూ విడిపోయారనడానికి ఇవే సాక్ష్యాధారాలు! అన్నంతగా కథనాలొచ్చాయి.
అయితే వీటన్నిటినీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ పలు సందర్భాల్లో ఖండించారు. అవాస్తవాలతో మీడియాలు కట్టుకథల్ని అల్లుతున్నాయని ఆ ఇద్దరూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ఎలాంటి ధృవీకరణలు లేకుండా కథనాలు వేస్తున్నారని అమితాబ్ మండిపడ్డారు.
ఇప్పుడు అభిషేక్ బచ్చన్ మరోసారి నిగూఢంగా స్పందించారు. ``నేను ఎక్కడ ఉన్నా తిరిగి సంతోషంగా నా కుటుంబానికి చేరతాను. నా భార్య బయటి చప్పుళ్లకు కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వదు`` అని చురకలు వేసారు. మీడియా తన వైఖరిని మార్చుకోవాలని అతడు చెప్పకనే చెప్పాడు.