Begin typing your search above and press return to search.

కొత్త సంవ‌త్స‌రంలో అమీర్‌ఖాన్ కొత్త ప్రారంభం

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 11:30 PM GMT
కొత్త సంవ‌త్స‌రంలో అమీర్‌ఖాన్ కొత్త ప్రారంభం
X

'లాల్ సింగ్ చ‌డ్డా' డిజాస్ట‌ర్ ఫ‌లితం మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హృద‌యాన్ని తీవ్రంగా గాయ‌ప‌రిచింది. ఎంతో సెంటిమెంటుగా ఫీలై.. క‌ఠోరంగా హార్డ్ వ‌ర్క్ చేసిన ఈ సినిమా అలాంటి చెత్త ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని అత‌డు ఊహించ‌లేదు. అందుకే ఆ త‌ర్వాత సుదీర్ఘ గ్యాప్ ని తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అమీర్ ఖాన్ త‌దుప‌రి సినిమాని ప్ర‌క‌టించ‌క‌పోవడానికి అత‌డిలోని అంత‌ర్మ‌ధ‌నం ఒక కార‌ణం.

ఎట్ట‌కేల‌కు అన్నిటి నుంచి అమీర్ కోలుకుంటున్నారు. తన పునరాగమన ప్రాజెక్ట్ ప్రారంభోత్స‌వం స‌హా విడుదల తేదీని లాక్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అమీర్ నటించే తదుపరి చిత్రం 20 డిసెంబర్ 2024న విడుదల కానుందని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

ఇప్ప‌టికి సినిమా వివరాలు గోప్యంగా ఉంచారు. ఈసారి మునుప‌టిలా కాకుండా అన‌వ‌స‌ర‌మైన అంచ‌నాలు పెంచే ఉద్దేశం అత‌డికి లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే అభిమానులు, పరిశ్రమ ఔత్సాహికులు ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోవాల‌ని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అమీర్ ఖాన్ కంబ్యాక్ ఎలాంటి ఛాలెంజ్ ని విసురుతుందో చూడాల‌న్న ఆస‌క్తి. చిత్ర పరిశ్రమలో అతడి గౌరవప్రదమైన స్థాయిని మరింతగా పెంచడంతోపాటు, చెప్పుకోదగ్గ దృశ్యకావ్యాన్ని ఆవిష్క‌రించాల్సిన సంద‌ర్భ‌మిది. షారూఖ్ ప‌ఠాన్ రేంజులో అత‌డు కంబ్యాక్ కావాల్సి ఉంటుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ నంబర్ 16 గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇది పూర్తిగా యాక్ష‌న్ సినిమానా లేక ఇంకేదైనా ప్ర‌యోగ‌మా? అన్న‌ది మునుముందు తెలుస్తుందేమో.