Begin typing your search above and press return to search.

కూతురు పెళ్లిలో హీరో ఫీట్లు...!

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ వివాహం ముంబైలోని రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 2:30 AM GMT
కూతురు పెళ్లిలో హీరో ఫీట్లు...!
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ వివాహం ముంబైలోని రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఉదయపూర్ లో కార్యక్రమాలు నిర్వహించారు. వివాహ వేడుక కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా బంధు మిత్రులు డాన్స్ లు, ఆటలు, పాటలు ఇలా అన్ని రకాలుగా సందడి చేశారు. ఆ సమయంలో ఇరా ఖాన్ తండ్రి అమీర్ ఖాన్‌ కూడా తన వంతు ఆటల్లో పాలు పంచుకున్నాడు. తాజాగా ఇరా ఖాన్‌ సోషల్‌ మీడియా ద్వారా తన తండ్రి పిక్స్ ను షేర్‌ చేసింది.

తాడు పట్టుకుని పైకి ఎక్కే టాస్క్ లో అమీర్‌ ఖాన్‌ పాల్గొన్నాడు. పెళ్లి వేడుకలో డాన్స్ లతో పాటు ఇలాంటి సాహస ఆటలను పెట్టడం వల్ల మరింతగా సందడి నెలకొంది అంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమీర్‌ ఖాన్‌ కూతురు పెళ్లి ఫోటోలు వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

అమీర్‌ ఖాన్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా కూడా ఆయన నుంచి రాబోయే సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అమీర్ ఖాన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ ఉన్నాడు.