హీరో కపుల్ తో క్రికెటర్ జంట!.. బ్యూటిఫుల్ ఈవెనింగ్!!
ప్రస్తుతం ఆ ఫోటో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అయితే సోఫీ.. ఐర్లాండ్ కు చెందిన అమ్మడు. ఆమెతో శిఖర్ ధావన్ రిలేషన్ లో ఉన్నట్లు కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 18 April 2025 6:54 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. ఇప్పుడు గౌరీ స్ప్రట్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అది అమీరే స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి కనిపించారు. మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ లో అమీర్ ఖానీ, గౌరీ సందడి చేశారు. ఫొటోలకు కూడా పోజులిచ్చారు.
అందుకు సంబంధించిన పిక్స్ అప్పుడు ఫుల్ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా మరో పిక్.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో అమీర్, గౌరీ ఉన్నారు. వారితోపాటు క్రికెటర్ శిఖర్ ధావన్, అతడి రూమరింగ్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ కనిపించారు. వీరంతా కలిసి ఓ సాయంత్రం సంతోషంగా గడిపారు. ఆ పిక్ సోఫీనే షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అయితే సోఫీ.. ఐర్లాండ్ కు చెందిన అమ్మడు. ఆమెతో శిఖర్ ధావన్ రిలేషన్ లో ఉన్నట్లు కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. సోఫీతో గబ్బర్ దిగిన పిక్స్ కూడా చక్కర్లు కొట్టాయి. రీసెంట్ గా ధావన్ ఆమెతో రీల్స్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.
'గురూజీ ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. నేను నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అని సోఫీ అడగ్గా, 'ఇంట్లో పని చేసేందుకు వస్తావా?' అంటూ ధావన్ ఫన్నీగా డైలాగ్ చెప్పాడు. దీంతో అంతా ఫిక్స్ అయిపోయారు. ఇన్ డైరెక్ట్ గా శిఖర్ ధావన్ రిలేషన్ షిప్ ను అనౌన్స్ చేసేశాడని కామెంట్లు పెట్టారు. ఆ రీల్ ను తెగ ట్రెండ్ కూడా చేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ధావన్, ఆయేషా మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉన్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఆమెకు అంతకు ముందే మరో పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2023లో ధావన్, ఆయేషాకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇప్పుడు శిఖర్.. సోఫీ షైన్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమీర్ కూడా ఇప్పటికే కిరణ్ రావ్, రీనా దత్తాతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీతో రిలేషన్ లో ఉన్నారు. అలా మొత్తానికి రెండు జంటలు దిగిన పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
