కూతురితో రొమాన్స్.. ఇన్నాళ్టికి ఓపెనైన స్టార్ హీరో!
చాలా విసుగు చెందిన తర్వాత ఇప్పటికి ది లల్లంటాప్ తో చాటింగ్ సెషన్ లో అమీర్ ఖాన్ వివరణ ఇచ్చాడు.
By: Tupaki Desk | 3 July 2025 6:00 AM ISTఒక సినిమాలో కుమార్తెగా నటించిన కథానాయికతో ఆ హీరో మరో సినిమాలో లవర్‌గా రొమాన్స్ చేయొచ్చా? అలా చేస్తే ఆడియెన్ ఒప్పుకుంటారా? ఈ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానమిచ్చాడు ఈ స్టార్ హీరో. ఇదే సందేహాన్ని వ్యక్తం చేసిన తన దర్శకనిర్మాతలతో తాను ఆరోజు విభేధించానని అన్నాడు. దీనిని నేను అస్సలు నమ్మను. సినిమాల్లో ఇలాంటివి సహజమని వారితో వాదించాను! అని చెప్పాడు. అంతేకాదు.. ప్రేక్షకులను మనం తక్కువ అంచనా వేస్తున్నామని కూడా దర్శకనిర్మాతలతో సదరు హీరో వాదించాడట. మొత్తానికి దంగల్ లో కూతురి పాత్రలో నటించిన సనా షేక్ తో ఆ తర్వాత `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`లో రొమాన్స్ చేసిన అమీర్ ఖాన్ కి చాలా పెద్ద గుణపాఠమే అయింది. ఆ సినిమా పరాజయానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
అంతేకాదు ఎథికల్ గాను సూపర్ స్టార్ దిగ జారాడని చాలా విమర్శలే వచ్చాయి. దంగల్ లో కుమార్తెగా కనిపించిన ఫాతిమాతో రియల్ లైఫ్ లోను అమీర్ డేటింగ్ చేసాడనే విమర్శలు ఉన్నాయి. వాటికి కూడా అతడు జీవితాంతం సమాధానం చెబుతూనే ఉన్నాడు. అతడు ఇంటర్వ్యూల్లో దొరికితే చాలు మీడియా మొదటగా ప్రశ్నించేది ఈ రెండు ప్రశ్నలే. ఒకటి కూతురిగా నటించిన యువతితో మీరు తర్వాతి సినిమాలో లవర్ గా ఎలా రొమాన్స్ చేస్తారు? కుమార్తెగా నటించిన యువతితో ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్- డేట్ లు ఎలా చేయగలరు? అంటూ అమీర్ ని పదే పదే మీడియాతో పాటు సోషల్ మీడియాల్లో నెటిజనులు కూడా విసిగిస్తూనే ఉన్నారు.
చాలా విసుగు చెందిన తర్వాత ఇప్పటికి ది లల్లంటాప్ తో చాటింగ్ సెషన్ లో అమీర్ ఖాన్ వివరణ ఇచ్చాడు. తాను నిర్మాతలతో పూర్తిగా విభేధించానని, అసలు ప్రజలు ఆ దృష్టితో చూడరని అన్నట్టు అమీర్ ఖాన్ చెప్పాడు. కూతురి పాత్రధారితో వేరొక సినిమాలో రొమాన్స్ చేయడాన్ని ఒక రకంగా సమర్థించుకున్నాడు.
అంతేకాదు.. తామంతా చాలా ప్రయత్నించినా కానీ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో సనా షేక్ చేసిన పాత్రలో నటించేందుకు ఏ ఒక్క హీరోయిన కూడా ముందుకు రాలేదని అమీర్ అన్నాడు. కత్రిన, దీపిక, కరీనా సహా చాలా మంది స్టార్ హీరోయిన్లను సంప్రదించారు. పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు అందరినీ అడిగాం. కానీ ఎవరూ చేయనని అన్నారు. చివరికి సనాతో చేసాను అని చెప్పాడు అమీర్. అయితే పదే పదే స్క్రిప్టు మార్పులతో రూపొందిన ఈ సినిమాలో ఏది వర్కవుట్ కాదో దర్శకనిర్మాతలు విజయ్- ఆదిత్య చోప్రాతో చెప్పానని, కానీ అంతిమంగా వారిదే నిర్ణయమని కూడా తెలిపారు. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ అమీర్ ఖాన్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.
