మలయాళ నటి పోస్ట్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు..
టర్కిష్ తర్కం, గ్యాంగ్స్ ఆఫ్ 18 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ అమీనా నిజమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతోంది
By: Tupaki Desk | 9 May 2025 11:04 AM ISTటర్కిష్ తర్కం, గ్యాంగ్స్ ఆఫ్ 18 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ అమీనా నిజమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతోంది. దానికి కారణం ఆమె నెట్టింట షేర్ చేసిన పోస్ట్. రీసెంట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడం, ఆ దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై అమీనా స్పందిస్తూ, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ప్రజలను చంపడంపై తాను సిగ్గు పడుతున్నానని చెప్తూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. చంపుకోవడం వద్దని అమీనా చెప్తున్న శాంతి పాఠాలు బావున్నప్పటికీ అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయాన్ని ఆమె గుర్తించాల్సిన అవసరం ఉందంటూ ఆమెను నెటిజన్లు దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్లు అమీనాను విమర్శించడమే కాకుండా ఆమెకు అలాంటి అభిప్రాయాలు ఉన్నందు వల్ల ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని కూడా ఫిల్మ్ మేకర్స్ ను కోరుతున్నారు. యుద్ధం, దాని వల్ల వచ్చే పర్యవసానాల గురించి హేతుబద్ధమైన ఆలోచన మంచిదే అయినప్పటికీ పాకిస్తాన్ ఫండింగ్ చేస్తున్న ఎంతో మంది ఉగ్రవాదులు ఇండియాపై చేసిన దాడుల గురించి మర్చిపోకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియా- పాక్ మధ్య యుద్ధమే సొల్యూషన్ కాదు. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో భారత పౌరులంతా కలిసికట్టుగా నిలబడి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిమానులు సైతం అంటున్నారు. ఇలాంటి టైమ్ లో అమీనా పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదు.
